Whose Capital Amaravathi - Acknowledgements
కృతజ్ఞతలు గత ఆరు మాసాల నుండి నేను ఈ పుస్తక రచనకు సమాచారాన్ని సేకరిస్తూ వున్నాను. ఎ.ఎస్.సి.ఐ. (ASCI) లో సెంటర్ ఫర్ అర్బన్ గవర్నన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ప్రొ. వి. శ్రీనివాసాచారి గారి మార్గదర్శకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎమ్.సి.ఆర్.హెచ్.ఆర్.డి. డైరెక్టర్ జనరల్ బిపి ఆచార్య గారికి, సెంటర్ ఫర్ అర్బన్ డెవలప్‌మెంట్ స్టడీస్ అధ్యక్షులు డా. దీపా నాయర్ గారికి వారితో సంభాషణలలో ఇచ్చిన విలువైన సమాచారానికి గాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా సెస్ (Cess) ప్రొ. సి. రామచంద్రయ్య గారికి కృతజ్ఞతలు. ఉండవల్లి అరుణ్ కుమార్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి గార్లతో సంభాషణలు విషయ స్పష్టతకు నాకు తోడ్పడ్డాయి. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు గురువు, శ్రేయోభిలాషి, బహుకాలంగా మార్గదర్శకుడు శ్రీ రాపాక ఏకాంబరాచార్యులు ఆంధ్రదేశపు రాజధానీ నగరాలను గురించిన చారిత్రక వివరాలపై ఒక వ్యాసాన్ని నాకందించారు. ఇది ఒక అధ్యయానికి ఆధారంగా ఉపయోగపడింది. వారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన నా శ్రేయోభిలాషి నా సీనియర్ సహోద్యోగి ...