Land pooling - Whose Capital Amaravathi
1 0. లాండ్ పూలింగ్ - అమరావతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఇరుపక్షాలకూ లాభదాయకంగా ఉండే లాండ్ పూలింగ్ ప్రక్రియ ఒక సృజనాత్మక ప్రయోగం. 1890 లలో దీన్ని హాలండ్, జర్మనీలలో విజయవంతంగా ఉపయోగించారు. భారతదేశంలో మొదటిసారి 1915 లో బాంబే టౌన్ ప్లానింగ్ చట్టం కింద ప్రారంభించారు. మాహిం, ఖార్ ప్రాంతాలలో, పెద్ద భాగాల అభివృద్ధికి అది తోడ్పడింది. కాని ఒక చిన్న ప్లాట్లు విషయంలో కూడా యాజమాన్య వివాదాలు ప్రాజెక్టులను అడ్డుకోవడం ప్రారంభించాయి. లాండ్ పూలింగ్‌ను గుజరాత్‌లో 1976 కొత్తగా ఏర్పరచిన చట్టం ద్వారా అమలుచేయడం ప్రారంభించారు. ప్లాట్ల యాజమాన్య వివాదాల సమస్యను 1999 లో టౌన్ ప్లానింగ్ స్కీమును ఆమోదించిన తర్వాత గుజరాత్ అధిగమించింది. వాళ్లు భూమిని స్వాధీనం చేసుకొని రోడ్లు వేయడం ప్రారంభించారు. ఫలితంగా భూముల ధరలు పెరిగాయి. గుజరాత్‌లో లాండ్ పూలింగు జనానికి ప్రోత్సాహమిచ్చింది. లాండ్ పూలింగ్ అంటే అనేక భూ కమతాలను ఒకటిగా పూల్ చేసి భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఉపయోగించి మిగిలిన భూమిని భూ యజమానులకు అభివృద్ధి హక్కులతో తిరిగి ఇవ్వడం లాండ్ పూలింగ్ విధానం. ఇట్లా పూల్ చేసిన భూమిలో కొంతభాగా...