Posts

Showing posts with the label wto

అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు_రైతుల హక్కులు

Image
ఈమధ్య గుజరాత్ రాష్ట్రంలో పెప్సీ కంపెనీ వారు రైతుల పైన కోర్టులో కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ కేసులు వేశారు.  తాము సంపాదించిన పేటెంట్ కు విఘాతం కలిగించే విధంగా విత్తనాలు ఉపయోగించి వ్యవసాయం చేశారనేది వారి మీద మోపబడిన ప్రధాన అభియోగం. 2001వ సంవత్సరంలో రూపొందించిన మొక్కలలో రకాలు రైతుల హక్కుల పరిరక్షణ చట్ట(plant varieties and farmers rights protection act ) ఉల్లంఘన కు రైతులపై ఈ కేసు పెట్టడం అయింది. 1989వ సంవత్సరం నుంచి భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం తో మొదలుపెట్టి ఒప్పంద వ్యవసాయ విధానం ద్వారా(contract farming) వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు అమ్మకం చేస్తూ ఉన్న పెప్సీ కంపెనీ దాదాపు 30 సంవత్సరాల అనుభవం తరువాత ఈరోజు రైతులపై కేసులు పెట్టటం కొంత విచిత్రంగానే కనిపిస్తుంది. కానీ పెప్సీ కంపెనీ పెట్టిన ఈ కేసులో మూలంగా మొక్కలలో రకాలు రైతుల ప్రయోజనాల పరిరక్షణ చట్టంలోని కొన్ని లొసుగులు అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.    పై చట్టంలో సెక్షన్ 39 క్రింద వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ గురించి చెప్పడం జరిగింది. బ్రాండింగ్ చేసి వాణిజ్యపరంగా  అమ్మ నంతవరకు వ్యవసాయ దారుల చేత  రక్షిత వంగడాల వాడ...