WHOSE CAPITAL AMARAVATHI - THEORETICAL BACKGROUND
. సైద్ధాంతిక నేపథ్యం ‘కాపిటల్ సిటీస్ వెరైటీస్ అండ్ పాటర్న్స్ అఫ్ డెవలప్‌మెంట్ అండ్ రీలొకేషన్’ అన్న తన గ్రంథంలో వాదిమ్ రాస్‌మన్ రాజధానీనగరాల స్థలాల సైద్ధాంతిక నేపథ్యాన్ని విపులంగా చర్చించాడు. అతని అభిప్రాయంలో ఏ రాజధానీనగరానికి స్థల నిర్ణయం చేయాలన్నా ఉండవలసిన ప్రాథమిక ఆలోచనావిషయాలు, ప్రామాణిక సూత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో రాజ్యభద్రత, ఆర్థిక, పరిపాలనాపరమైన ప్రభావశీలత, నిష్పాక్షికత, గుర్తింపు ఉన్నాయి. ఒక రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయంలో భద్రత అంత ఆవశ్యకమైన లక్షణం కాకపోవచ్చు. కాని తక్కిన మూడూ నిష్పాక్షిత, గుర్తింపు, పరిపాలనా సౌలభ్యం అన్నవి ముఖ్యమే. రాజధాని ఎంపికలో నిష్పాక్షికత లేనప్పుడు ప్రభుత్వానికి విశ్వసనీయత ఉండదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు రాజధానిలో సరైన ప్రాతినిధ్యం ఉందా? రాజధానిలో వారు తమకు ఉనికి ఉందని భావిస్తున్నారా? రాజధాని నుండి వచ్చే ప్రయోజనాలు ఆ రాజధాని అన్ని ప్రాంతాలనూ ఎంత కలుపుకొని ఉందన్న విషయాన్ని నిర్ధారిస్తాయి. ఈ నిష్పాక్షికత, అందరినీ కలుపుకోవడం అన్న సూత్రం ప్రభుత్వానికి న్యాయసమ్మతిని ఇస్తుంది. అది లేకపోతే ప్రభుత్...