Posts

Showing posts with the label SECTION8

My Relations With Telangana CM ,KCR -Navyandhratho na nadaka

Image
కేసిఆర్ ముఖం విప్పారింది. బొటన వేలు చూపించి ‘డన్’ అన్నారు. .... "నవ్యాంధ్ర తో నా నడక"   9. కేసిఆర్‌తో సంబంధాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకోసం నేనెంత పోరాడినా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు నేనంటే మంచి అభిప్రాయమే ఉండేదని తెలిసింది. ‘మీరంటే ఆయనకు అభిమానం.. మీ నిజాయితీని ఆయన గౌరవిస్తారు..’ అని రాజీవ్ శర్మ ఒక సందర్భంలో చెప్పారు. నేను కేసిఆర్ ను ఒకటి రెండు సందర్భాల్లో తప్ప కలుసుకోలేదు. కలుసుకోవాల్సిన అవసరం రాలేదు.  2015 డిసెంబర్ లో కేసిఆర్ ఆయుత చండీ యాగం తలపెట్టినప్పుడు మాత్రం ఆయనను కలుసుకునే అవకాశం లభించింది. అప్పుడు నేను ఛీఫ్ సెక్రటరీగానే ఉన్నాను.అప్పటికి నాకు ఆహ్వానం రాలేదు. యాగనిర్వాహకుల్లో ఒకరైన వెంకట రమణ శర్మ ఒకరోజు నాకు ఫోన్ చేశారు.  ‘యాగానికి ఎప్పుడు వస్తున్నారు సార్’ అని ఆయన అడిగారు.  ‘నాకు ఆహ్వానం అందలేదండీ’ అని చెప్పాను.  ఆయన ఆశ్చర్యపోయారు. ‘మీకు ఆహ్వానం లేకపోవడమేమిటి సార్, మీరు వస్తారన్న చర్చ కూడా జరిగింది. ఎక్కడో పొరపాటు అయినట్లుంది. ఉండండి. మీతో మళ్లీ మాట్లాడుతాను’ అని ఫోన్ పెట్టేశారు. సరిగ్గా మూడు నిమిషాల్లో ముఖ్యమంత్రి కార్యాలయం ...

"Our people briefed me"- Navyandhra tho na nadaka

Image
7. ‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మి’ 2015 జూన్ 1 సాయంత్రం T.V. పెట్టినప్పుడు ‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్‌మి’ ఉదంతం ప్రసారమవుతుంది. ఈ సంభాషణ వినగానే నాకు మతిపోయినట్లయింది. ఒక సిఎం ఎన్నికల అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు రావడం, ఆయన గొంతును కూడా వినిపించడంతో ఆయన ప్రతిష్ఠ దెబ్బతింటుందనే అనిపించింది. నిజానికి అంతకు ముందే తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్‌సన్ ఇంటికి వెళ్లి శాసన మండలి ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటువేసేందుకు అయనకు డబ్బులు ఇవ్వజూపినట్లు టీవీలు చూపించాయి. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రే ఫోన్‌లో మాట్లాడినట్లు చూపిస్తున్నారు.  సాయంత్రానికల్లా రాష్ట్ర సలహాదారు పరకాల ప్రభాకర్ స్వయంగా టీవీల ముందుకు వచ్చి జరిగిన దాన్ని ఖండించారు. ‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌గారికి ఇక్కడున్నటువంటి శాంతి భద్రతలు, ప్రజల యొక్క స్వేచ్ఛ, ప్రజల యొక్క ఆస్తులు, ముఖ్యమైనటువంటి సంస్థల విషయంలో బాధ్యత ఉన్నది. వారు బాధ్యత తీసుకోనప్పుడు, వారు దీన్ని నడపనప్పుడు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆంధ్ర...

Navyandha tho na nadaka - Other division issues

పార్లమెంటులో ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిన ప్రకటనలో చాలా స్పష్టంగా విభజన జరిగిన నాటి నుంచి 14వ ఆర్థిక సంఘం నివేదిక అమలయ్యే సమయం వరకు రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తుంది అని పేర్కొన్నారు. .. " నవ్యాంధ్రతో నా నడక"      5. ఇతర విభజన అంశాలు సంస్థలను ఉద్యోగులను విభజించే ప్రక్రియకు అనుబంధంగా ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లో కొత్త రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేసే అంశాలను కొన్ని కొత్త ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసే విధి విధానాలను పొందుపరచటం జరిగింది.దీనిలో ముఖ్యమైనది కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వెంటనే దృష్టి పెట్టవలసిన అంశం 14వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ కోరికలు తెలియజేస్తూ ఒక నివేదిక సమర్పించడం.  రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 46 వ సెక్షన్ లో ఈ 14వ ఆర్థిక సంఘం ప్రస్తావన ఉన్నది. తదనుగుణంగా రాష్ట్రపతి రెండు కొత్త రాష్ట్రాలకు తమ అవార్డు ఇవ్వవలసిందిగా ఆర్థిక సంఘాన్ని కోరారు. ఈ సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ...

Navyandhra tho na nadaka - challenges in the division of Employees

Image
షెడ్యూల్డు 10 సంస్థలన్నిటిపై మా హక్కు గురించి మేము పోరాడినందువల్ల రెండు ప్రభుత్వాల మధ్య తీవ్ర వైషమ్యాలు తలెత్తాయి - "నవ్యాంధ్ర తో న నడక"   4. సంస్థలు, ఉద్యోగుల విభజనలో సవాళ్లు ఆంధ్ర ప్రదేశ్ విభజన అనేది విచిత్రమైనది. ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారు రాజధానికి దూరంగా ఉన్నారు. ఛత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు కావాలని ఉద్యమించిన ప్రాంతాల్లో సమైక్య రాష్ట్ర రాజధానులు లేవు. అవి తమ నూతన రాజధానులను, అందులో కొత్త సంస్థలను ఏర్పర్చుకోవాల్సి వచ్చింది. వాటికి పాత రాజధానుల్లోని సంస్థల్లో వాటాలను అడిగే అవకాశం లేకుండా పోయింది. విభజించడమే మహా ప్రసాదంగా భావించి, వారి ప్రాంతాలకు వెళ్లిపోయి పనులు ప్రారంభించుకున్నారు. ఉమ్మడి రాజధానిలో వాటా అడగలేదు, కేంద్రం ఇవ్వనూ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఉన్న ప్రాంతం నుంచి విభజన కోసం ఉద్యమం ప్రారంభమైంది. కనుక కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నుంచి దూరంగా వెళ్లి పోవాల్సి వచ్చింది. అందువల్లే రాజధానిలో ఉన్న సంస్థల్లో వాటా కోసం అడగాల్సిన అవసరం ఏర్పడింది. ‘మమ్మల్ని మీరు వెళ్లిపొమ్మన్నారు. మా వాటా మాకివ్వండి. మేము వెళ్లిప...

HOW SECTION 8 IN THE REORGANISATION ACT GOT ECLIPSED

Image
3. సెక్షన్ 8కి కాలదోషం ఎందుకు పట్టింది? Navyandhra tho na nadaka ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 కి చివరకు కాలదోషం పట్టింది. ఇందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అని విషయాలను లోతుగా పరిశీలించిన వారెవరికైనా తెలుస్తుంది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించినందువల్ల సెక్షన్ 8కి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి హైదరాబాదులో స్థిరపడిన వారి ప్రాణధన ఆస్థిపరిరక్షణకు ఉద్దేశించబడిన సెక్షన్ సెక్షన్ 8. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఉమ్మడి రాజధానిలో పరిపాలనకు సెక్షన్ 8 వీలు కల్పిస్తుంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల స్వేచ్ఛను, ఆస్తులను కాపాడే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. ముఖ్యంగా శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలక ప్రదేశాల భద్రత, ప్రభుత్వ భవనాల నిర్వహణ, కేటాయింపు గవర్నర్ బాధ్యత. తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించిన తర్వాత ఆయన స్వంత విచక్షణను ఉపయోగించి, నిర్ణయం తీసుకుంటారు.  గవర్నర్‌కు సలహాదారులుగా ఇద్దరు సలహాదారులను నియమించ...