Posts

Showing posts with the label apbifurcation

సామరస్యమే సరైన పరిష్కారం

Image
విశ్లేషణ ఏ సమస్యల పరిష్కారానికైనా కాలగతి ఎంత ముఖ్యమో అనువైన వాతావరణం కూడా అంతే ముఖ్యమని హిపోక్రిటస్‌ పేర్కొన్నాడు. విభజనానంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య గతంలో చాలా చిక్కుముళ్లు ఏర్పడటం వాస్తవమే కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తుతం ఉన్న సుహృద్భావ వాతావరణం మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి అత్యంత అనుకూలతను ఏర్పరుస్తోంది. ఉద్యోగుల విభజన వంటి కొన్ని అంశాలు గతంలోనే దాదాపుగా పరిష్కృతమయ్యాయి. మిగిలి ఉన్న రెండు ప్రధాన అంశాలు షెడ్యూల్‌ 9 షెడ్యూల్‌ 10కి చెందిన సంస్థల విభజన. కోర్టుల వరకు వెళ్లిన షెడ్యూల్‌ 10కి చెందిన సంస్థల విభజన అంశాన్ని ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పరిష్కరించుకోవచ్చు. ఇక 9వ షెడ్యూల్‌కి చెందిన వాణిజ్యపరమైన సంస్థల విషయంలో కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు.  సాధారణంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు అంత సులభంగా పరిష్కారం కావు. పంతాలు, పట్టింపులు ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి మామూలుగా అంత ప్రధానం కాని అంశాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. రాష్ట్రాల విభజనలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయనడంలో...

A Visionary Statesmen and a Strategic Manipulator - Whose Capital Amaravathi

Image
9. రాజధానీ నగరాలుగా కర్నూలు, అమరావతుల ఎంపికలో భేదం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడికీ, వ్యూహాత్మక చాణక్యనాయకత్వానికీ ఉన్న భేదం 1953 లో ఆంధ్ర రాజధానిగా కర్నూలును ఎంపిక చేసుకున్న పద్ధతి, 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానీనగరంగా అమరావతిని ఎంపిక చేసుకున్న పద్ధతి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వలక్షణాల గురించీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాల గురించీ బోలెడన్ని విశేషాలు చెప్తాయి. దీన్ని గురించి మరింత చర్చించే ముందు 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందో తెలుసుకోవడం మంచిది.  1920 నాగపూరు కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్రప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ఉద్యమం చేపట్టడమూ, అది జాతీయోద్యమంతో పాటు, విస్తరించడమూ దీనికి కారణం. 1937 లో శ్రీబాగ్ ఒడంబడికపై సంతకాలు జరిగాయి. రాష్ట్రంలోని విభిన్నప్రాంతాల్లో రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఇతర సంస్థలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి అన్న విషయంలో కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య అనౌపచారికంగా ఒక ఒప్పందం కుదిరింది. అప్పటికే ఆంధ్రవిశ్వవిద...

Whose Capital Amaravathi - Introduction

Image
ఉపోద్ఘాతం  - ‘ఎవరి రాజధాని అమరావతి?’  వలసపాలన రోజుల్లో రాజధానీనగరం రేవు పట్టణమై ఉండేది. దేశం లోతట్టు ప్రాంతాలనుండి వలసరాజ్యానికి ముడి సరకులు ఎగుమతి చేయడానికి, వాణిజ్యానికి ఇది అనుకూలంగా ఉంటుంది. బ్రిటిషువారి కాలంలో 1911 వరకు దేశ రాజధాని ‘కలకత్తా’. తక్కిన సంపన్నమైన ప్రెసిడెన్సీలు ‘బొంబాయి’, ‘మద్రాసు’ ప్రెసిడెన్సీల రాజధానులు బొంబాయి, మద్రాసులు కూడా రేవు పట్టణాలే. ఆ నాడు మద్రాసు ప్రెసిడెన్సీ పెద్ద ప్రెసిడెన్సీ. ఈ ప్రెసిడెన్సీలలో భిన్నభాషలు మాట్లాడే ప్రాంతాలున్నాయి. మద్రాసు (చెన్న పట్టణమని కూడా అంటారు) నుండి పరిపాలింపబడే మద్రాసు ప్రెసిడెన్సీలో, తమిళుల తర్వాత బహుళసంఖ్యలో ఉన్న ప్రజలు తెలుగువారే. కన్నడం, మలయాళం మాట్లాడే ప్రజలు కూడా ఉండేవారు కాని, వారిసంఖ్య తమిళులు, తెలుగువారి కంటే తక్కువ. ముందుగా ఇంగ్లీషు భాష నేర్చుకొని, దాని సహాయంతో ప్రభుత్వోగాలు సంపాదించుకున్నవారు తమిళులు. ప్రభుత్వోద్యోగాలలో అధికభాగం వారి చేతుల్లోనే ఉండేవి. ఇది తక్కిన భాషలు మాట్లాడేవారికి, ముఖ్యంగా అధికసంఖ్యలో ఉన్న తెలుగువారికి బాధాకరంగా పరిణమించింది. భాషాపరంగా ప్రత్యేకరాష్ట్రం కోసం అన్వేషణకు నాయకత్వం వహ...

Navyandhra tho na nadaka Hud-hud Cyclone

Image
టెలికమ్యూనికేషన్లను పునరుద్ధరించే విషయంలో ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌ను పబ్లిక్‌గా తిట్టి టీవీలో పబ్లిసిటీ పొందారు - "నవ్యాంధ్ర తో న నడక"   6. హుద్ హుద్‌లో తల మునకలు రాష్ట్ర విభజన జరిగి నాలుగు నెలలు కాలేదు, హుద్ హుద్ తుఫాను విశాఖను తాకి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. అక్టోబర్ 8న తుఫాను వచ్చే సూచనలు కనిపించాయి. అప్పటికి హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌లో నేను కొత్త బ్లాకులోకి షిఫ్టు కాలేదు. నేను చిన్నగదిలో పనిచేస్తున్నప్పుడే తుఫాను సమాచారం లభించింది. అండమాన్ వద్ద అల్పపీడనం పెను తుఫాను గాలిగా మారి అక్టోబర్ 12 నాటికి తీవ్రతరమై, కాకినాడ గోపాలపట్నం మధ్య తీరం దాటుతుందని తెలిసింది. ఆ విషయం నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెప్పాను. సరే, లెటజ్ ప్రిపేర్ అని ఆయన అన్నారు. ఆ రోజు మధ్యాహ్నమే హుద్ హుద్ తుఫానుకు సంసిద్ధతపై దాదాపు అన్ని విభాగాల అధిపతులతో సమావేశం ఏర్పాటు చేశాను. డీజీపి, అదనపు డీజీపీలు, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ కమాండెంట్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. 24గంటల పాటు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, ఫీల్డ్ ఆఫీసర్లను రంగంలోకి దించాలని, సెలవుల్లో ఉన్న అధికారులను వెనక్...

Navyandhra tho na nadaka - challenges in the division of Employees

Image
షెడ్యూల్డు 10 సంస్థలన్నిటిపై మా హక్కు గురించి మేము పోరాడినందువల్ల రెండు ప్రభుత్వాల మధ్య తీవ్ర వైషమ్యాలు తలెత్తాయి - "నవ్యాంధ్ర తో న నడక"   4. సంస్థలు, ఉద్యోగుల విభజనలో సవాళ్లు ఆంధ్ర ప్రదేశ్ విభజన అనేది విచిత్రమైనది. ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారు రాజధానికి దూరంగా ఉన్నారు. ఛత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు కావాలని ఉద్యమించిన ప్రాంతాల్లో సమైక్య రాష్ట్ర రాజధానులు లేవు. అవి తమ నూతన రాజధానులను, అందులో కొత్త సంస్థలను ఏర్పర్చుకోవాల్సి వచ్చింది. వాటికి పాత రాజధానుల్లోని సంస్థల్లో వాటాలను అడిగే అవకాశం లేకుండా పోయింది. విభజించడమే మహా ప్రసాదంగా భావించి, వారి ప్రాంతాలకు వెళ్లిపోయి పనులు ప్రారంభించుకున్నారు. ఉమ్మడి రాజధానిలో వాటా అడగలేదు, కేంద్రం ఇవ్వనూ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఉన్న ప్రాంతం నుంచి విభజన కోసం ఉద్యమం ప్రారంభమైంది. కనుక కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నుంచి దూరంగా వెళ్లి పోవాల్సి వచ్చింది. అందువల్లే రాజధానిలో ఉన్న సంస్థల్లో వాటా కోసం అడగాల్సిన అవసరం ఏర్పడింది. ‘మమ్మల్ని మీరు వెళ్లిపొమ్మన్నారు. మా వాటా మాకివ్వండి. మేము వెళ్లిప...

HOW SECTION 8 IN THE REORGANISATION ACT GOT ECLIPSED

Image
3. సెక్షన్ 8కి కాలదోషం ఎందుకు పట్టింది? Navyandhra tho na nadaka ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8 కి చివరకు కాలదోషం పట్టింది. ఇందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అని విషయాలను లోతుగా పరిశీలించిన వారెవరికైనా తెలుస్తుంది. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించినందువల్ల సెక్షన్ 8కి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి హైదరాబాదులో స్థిరపడిన వారి ప్రాణధన ఆస్థిపరిరక్షణకు ఉద్దేశించబడిన సెక్షన్ సెక్షన్ 8. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ పదేళ్ల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి. ఉమ్మడి రాజధానిలో పరిపాలనకు సెక్షన్ 8 వీలు కల్పిస్తుంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల స్వేచ్ఛను, ఆస్తులను కాపాడే బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. ముఖ్యంగా శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, కీలక ప్రదేశాల భద్రత, ప్రభుత్వ భవనాల నిర్వహణ, కేటాయింపు గవర్నర్ బాధ్యత. తెలంగాణ మంత్రి మండలిని సంప్రదించిన తర్వాత ఆయన స్వంత విచక్షణను ఉపయోగించి, నిర్ణయం తీసుకుంటారు.  గవర్నర్‌కు సలహాదారులుగా ఇద్దరు సలహాదారులను నియమించ...