Capital Cities of Andhras Through the centuries
6. శతాబ్దాల కాల పరిణామంలో ఆంధ్రుల రాజధానీ నగరాలు మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధం చేసినట్లు చెప్తున్నది. వింధ్యపర్వతాలకు దక్షిణప్రాంతంలో నివసిస్తున్న ఒక జాతిగా ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రులను పేర్కొంది. వీరు విశ్వామిత్ర మహర్షి కుమారులనీ, ఆయన వల్ల శాపం పొంది వింధ్యపర్వతాలకు దక్షిణాన స్థిరపడ్డారని పురాణకథనం. ఆంధ్రులకు సంబంధించి క్రీ.పూ. 2వ శతాబ్ది నుండి క్రీ.శ. 2వ శతాబ్ది వరకు భారతదేశంలోని ప్రధాన భూభాగాలను పరిపాలించిన అతి ప్రాచీన రాజవంశం శాతవాహన వంశం. శాతవాహనుల రాజధాని ధాన్యకటకం నేటి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి కి సమీపంలో ఉంది. పురాతత్త్వశాస్త్రవేత్తలు ఇక్కడ ఆ నాటికి చెందిన బౌద్ధనిర్మాణాల శిథిలాలను కనుగొన్నారు. శాతవాహనులు తమ రెండవ రాజధానిగా ప్రస్తుత మహారాష్ట్ర ప్రాంతంలోని ప్రతిష్ఠానపురాన్ని ఎంచుకున్నారు. విదేశీయుల దండయాత్రలను - ముఖ్యంగా హూణుల దండయాత్రలను - ఎదుర్కొనడానికి ఇది తోడ్పడుతుందని వాళ్లు భావించారు. భారతదేశమంతటా వ్యాపించిన ఒక బలమైన సామ్రాజ్యాన్ని శాతవాహనులు స్థాపించారు. మంచి పరిపాలనను అందించారు. హిందూ బౌద్ధమతాలు రెండింటినీ ప్రోత్సహించారు....