21st Centuries Capital Cities : Indian Experience
5. 21వ శతాబ్దపు రాజధానీనగరాలు 21వ శతాబ్దపు ప్రారంభంలో ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన కాలంలో దీర్ఘకాలంనుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న మూడు డిమాండ్లను అంగీకరించడం జరిగింది. దాని ప్రకారం అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి పర్వత ప్రాంతాలను వేరు చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరిచారు. బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గిరిజన ప్రాంతాలను వేరుచేసి, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఏర్పరిచారు. ఈ రాష్ట్రాల రాజధానీనగరాల స్థలాల గురించి ఈ అధ్యాయంలో చర్చిద్దాం. భారతీయ అనుభవం – ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుండి వేరుచేసి దాదాపు కుమావ్, గడువాల్ ప్రాంతాలనన్నింటినీ కలిపి నవంబర్ 2000 లో ఉత్తరాఖండ్ ప్రత్యేకరాష్ట్రాన్ని ఏర్పరిచారు. ఉత్తరాఖండ్ తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్ రాష్ట్రంలోని పెద్ద నగరం, దేశ రాజధాని కొత్త ఢిల్లీకి సమీపంలో ఉంది. హై కోర్టు మాత్రం నైనిటాల్‌లో ఉంది. వీరేంద్ర దీక్షిత్ చైర్మన్‌గా 2001 లో రాష్ట్రానికి శాశ్వత రాజధానీ స్థలాన్ని గుర్తించడానికి ఏకసభ్య కమిటీని నియమించారు. కమిటీ 2008 లో నివేదిక సమర్పించింది. ప్రభుత్వం నుంచి సరైన సమర్థన లేకపోవడం వల్ల నివేదికనివ్వడానికి ఏడేళ్ల సమయం పట్టింద