How and when Things Turned Sour
"కుల రాజకీయాల్లో చిక్కుకుపోయిన వ్యవస్థలో ఆయన గురించి చెప్పేవారెవ్వరు? తెలుగువాడు కావడమే ఆయన దురదృష్టమా?" -నవ్యాంధ్ర తో న నడక 10. ఎప్పుడు, ఎలా, ఎందుకు చెడింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేను ఛీఫ్ సెక్రటరీ కావడం తృటిలో తప్పిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత శేష ఆంధ్రప్రదేశ్‌కు ఛీఫ్ సెక్రటరీ అవుతానని నేను అనుకోలేదు. కాని తెలుగుదేశం వేసుకున్న సామాజిక వర్గాల లెక్కల మూలంగా నాకు యాదృచ్ఛికంగా ఛీఫ్ సెక్రటరీ పదవి దక్కింది. కాని నేను ఛీఫ్ సెక్రటరీ అయిన రెండు నెలల్లోనే తనకూ, నాకూ భావసారూప్యత అంతగా లేదన్న విషయం చంద్రబాబు గ్రహించినట్లున్నారు. గ్రహించిన తర్వాత కీలకమైన నిర్ణయాల్లో నన్ను విశ్వాసంలోకి తీసుకోవడం మానివేశారు. నాకు తెలియకుండా నిర్ణయాలు జరిగేవి. నేనూ నా స్థాయి తగ్గించుకుని కలిసిపోవాలని ప్రవర్తించలేదు. నాకు నేను ఒక పరిధి ఏర్పర్చుకుని పనిచేయడం ప్రారంభించాను. చంద్రబాబు సమీక్షించని ప్రాజెక్టులు, కార్యక్రమాలపై దృష్టి పెట్టి ఛీఫ్ సెక్రటరీగా ప్రభుత్వ వ్యవస్థ సవ్యంగా సాగేలా చూసుకో సాగాను. తమకు అనుకూల నిర్ణయాలు తీసుకునేందుకు నేను అడ్డుగా ఉంటానని భావించారేమో నన్ను ఒకటి రెండు సార్లు తప్ప...