Posts

Showing posts with the label votefornote

Whose Capital Amaravathi - The Conclusion

Image
15. ముగింపు/ఉపసంహారం ఈ పుస్తకంలో మనం ఇంతరవరకు ప్రాచీనకాలంలో ఆంధ్రుల రాజధానీనగరాలతో ప్రారంభించి ఆధునికకాలం వరకు, మరింత నిర్దిష్టంగా స్వాతంత్ర్యానంతరం కర్నూలు నుండి హైదరాబాదు ద్వారా 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించడానికి దారితీసిన ప్రక్రియ వరకు చరిత్రను పరిశీలించాం. 1953 లో రాజధానిని కర్నూలులో నిర్ణయించిన నాయకత్వశైలికీ, 2014 లో అమరావతి ఎంపికలో నాయకత్వశైలికీ తారతమ్యం చూశాం. రాజధానీనగర స్థలాల ఎంపికలో సైద్ధాంతిక నేపథ్యాన్ని చారిత్రిక దృక్కోణంలో పరిశీలించాం.  వివిధ ఖండాలలో రాజధానీ నగరాల స్థాపనలో అంతర్జాతీయ అనుభవాలను, స్వాతంత్ర్యానంతరం మన దేశంలో రాజధానీ నగరాల ఏర్పాటు అనుభవాలను, 21వ శతాబ్దంలో ప్రజల డిమాండుపై రాష్ట్రాలను విభజించడం వల్ల కొత్తగా ఏర్పరచవలసి వచ్చిన రాజధానుల అనుభవాలను పరిశీలించాం. అమరావతికి నిర్దిష్టమైన, ప్రత్యేకమైన సమస్యల దృష్ట్యా లాండ్ పూలింగు, మల్టీ లేటరల్ ఏజెన్సీలనుండి ఆర్థిక సహాయం, కొన్ని విదేశాలు, కంపెనీలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి రాజధానీనగరం అమరావతి నిర్మాణానికి ఆహ్వానించిన ప్రభుత్వ ప్రయత్నాలు మొదలైనవాటి గురించి గత అధ్యాయాలలో చర్చిం...

Ghost Cities of China - Whose Capital Amaravthi

Image
14. చైనా ఘోస్ట్ నగరాలు - నేర్చుకోవలసిన పాఠాలు చైనా ఎంత వేగంగా నగరాలు నిర్మించిందంటే, జనం వాటిలోకి తరలిరావడానికి సమయం చాల లేదు. డిమాండు ననుసరించి పట్టణ ప్రాంతాలను క్రమంగా విస్తరించడానికి బదులు, చైనా పూర్తిగా కొత్తనగరాలను అన్నిటినీ ఒక్కసారిగా నిర్మించాలని తలపెట్టిందని ఆండ్రూ టరంటోలా తన వ్యాసంలో రాశాడు. ఇందులో ఒక లాభం ఉంది సెంట్రల్ ప్లానింగ్, సమగ్ర పట్టణ ప్రణాళికలకు అవకాశం ఏర్పడుతుంది. కాని మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడింది, ఎందుకంటే జనం ఆ నగరాలకు తరలడానికి ఇష్టపడలేదు. మొక్కజొన్న పొలాలలో నిర్మించిన న్యూ సౌత్ చైనా మాల్, దాన్ని ప్రారంభించిన దశాబ్దం తర్వాత కూడా 99% జనావాస రహితంగానే ఉండిపోయింది. దీన్ని 2005 లో 8,92,000 చదరపు మీటర్ల బిల్డప్ ఏరియాలో నిర్మించారు. తియాందు చెంగ్ హాంగ్ ఝాన్‌లో కొత్తగా నిర్మించిన తియాందు చెంగ్ నగరంలో జనమే లేరు. ఈ నగరంలో ఐఫెల్ టవర్‌కి ప్రతిరూపం ఉండడం విశేషం. 2003 లో సెంట్రల్ మంగోలియాలో ఉత్తర చైనా దుబాయిగా పిలిచే కాంగ్ బాషి రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్‌కు బలిపశువయింది. రియల్ ఎస్టేట్ స్పెక్యులేటర్లు ఈ నగరంలో చేరి సముచితమైన మార్కెట్ ధరలకంటే చాలా అధికం...

Amaravathi and other cities of AP - Whose Capital Amaravathi

Image
13. అమరావతి - ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాలు అమరావతి, దాని అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతరనగరాల అభివృద్ధిని రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కుంటుపరిచే అవకాశం ఉంది. ‘Capital cities Varieties and Patterns of Development and Relocation’ అన్న తన పుస్తకంలో వాదిం రాస్‌మన్, కొన్ని ఆసక్తికరమైన పరిశీలనలు చేశాడు. తగినంత పరిమాణం కలిగిన బలమైన నగరాల నెట్‌వర్క్ ఉన్న దేశాలు, ప్రాంతాలలో రాజధానీనగరాలు స్వాభావికంగానే చిన్నవిగా ఉంటాయనీ, నగరాల నెట్‌వర్క్ చిన్నదిగా ఉండి నగరాలు పరిమాణంలోనూ, సంఖ్యలోనూ తక్కువగా ఉన్నప్పుడు రాజధానీనగరాల పరిమాణం పెద్దదిగా ఉంటుందనీ అతనంటాడు. మధ్యస్థాయి పరిమాణం గల అనేక పట్టణాల నెట్‌వర్కు, వైజాగ్, విజయవాడ, తిరుపతి అనే మూడు పెద్ద నగరాలు రాష్ట్రం మూడు ప్రాంతాలలోనూ ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టం.  ఇటువంటి బలమైన నగరాల నెట్‌వర్కు ఉన్న రాష్ట్రంలో ఒక భారీ పరిమాణం గల హరితక్షేత్ర రాజధానీ నగరంపై ప్రత్యేక శ్రద్ధ శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు తేనెకుండ ప్రభావాన్ని చూపి, పెట్టుబడులు, నిధులు అన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ప్రస్తుతం ఉన్న నగరాల విస్తరణకూ, ఆ...

Swiss Challenge Singapore - Whose Capital Amaravathi

Image
12. స్విస్ ఛాలెంజి - సింగపూరు సంబంధం కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రణాళిక వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాను, వివరణాత్మక మాస్టర్ ప్లానుల రచన కోసం సింగపూరు ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రారంభిక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సింగపూరు ప్రభుత్వం ఉచితంగానే తయారుచేసింది. కాని వివరణాత్మక మాస్టర్ ప్లాన్ కోసం రాష్ట్రప్రభుత్వం సింగపూరు ప్రభుత్వానికి సంబంధించిన సుర్బానా సంస్థకు 12 కోట్ల రూపాయలు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి, స్టార్టప్ ఏరియాలో సీడ్ కాపిటల్ సిటీ నిర్మాణంలో సింగపూరు కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడంలో అనుసరించిన మొత్తం పద్ధతిని, ప్రక్రియను పరిశీలిస్తే, ఆ కంపెనీలకు కాంట్రాక్టు కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకున్నట్లు, తాము ముందే నిర్ణయించుకున్నట్లు సింగపూరు కంపెనీలకు ప్రాజెక్టు నివ్వడానికి కావలసిన ఔపచారిక ప్రక్రియను నిర్వహించినట్లు అనిపించక మానదు.  ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్విస్ ఛాలెంజి పద్ధతిని ఎంచుకుంది. కాని దాన్ని కూడా ఉన్నదున్నట్లుగా కాని, ప్రక్రియ విధి విధానాలను సక్రమంగా అనుసరించకుండా వక్ర మార్గంలో ఈ సి...

World Bank and Amaravathi - Whose Capital Amaravathi

Image
11. ప్రపంచ బాంకు - అమరావతి స్పెషల్ కాటగిరీ స్టేటస్‌కు బదులుగా  భారతప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ పాకేజ్ స్కీము నుండి ప్రయోజనం పొందే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్టెయినబుల్ కాపిటల్ సిటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు ప్రపంచబాంకు ఋణానికి వెళ్లింది. వాస్తవానికి స్పెషల్ కాటగిరీ స్కీములో ఇఎపి ప్రాజెక్టుకు అప్పుగా కాక గ్రాంటురూపంలో సహాయం చేసే కొన్ని వాగ్దానాలున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల మౌలిక సదుపాయాలు, వరదల తగ్గింపు చర్యలు, సాంకేతిక సహాయం ఉంటాయి. ఈ ప్రాజెక్టు అవుట్ లే రూ॥ 5000 కోట్లు. ఇందులో రూ॥ 2000 కోట్లు ప్రపంచ బాంకునుండి అప్పుగా, రూ॥ 1000 కోట్లు ఆసియా అభివృద్ధి బాంకు (ఎడిబి) నుండి అప్పుగా, తక్కిన మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రావాలి. ఈ ప్రాజెక్టుకు ప్రపంచబాంకు నుండి అప్పు తీసుకునే విషయంపై స్థానిక ప్రజలకు ఎన్నో అభ్యంతరాలున్నాయి.  ప్రపంచ బాంకు నియమాలు, హద్దులను ప్రభుత్వం పాటించకుండానే అమరావతి ప్రాజెక్టుతో ముందుకు వెళ్లింది. అందువల్ల ప్రపంచ బాంకు ఒక ఇన్స్‌పెక్షన్ టీమును ఏర్పరచాలని నిర్ణయించింది. ఈ టీము తమ ఇన్స్‌పెక్షన్ రిపోర్టులో అనేక విషయాలను పేర్కొంది. ఆ ...

Land pooling - Whose Capital Amaravathi

Image
1 0. లాండ్ పూలింగ్ - అమరావతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఇరుపక్షాలకూ లాభదాయకంగా ఉండే లాండ్ పూలింగ్ ప్రక్రియ ఒక సృజనాత్మక ప్రయోగం. 1890 లలో దీన్ని హాలండ్, జర్మనీలలో విజయవంతంగా ఉపయోగించారు. భారతదేశంలో మొదటిసారి 1915 లో బాంబే టౌన్ ప్లానింగ్ చట్టం కింద ప్రారంభించారు. మాహిం, ఖార్ ప్రాంతాలలో, పెద్ద భాగాల అభివృద్ధికి అది తోడ్పడింది. కాని ఒక చిన్న ప్లాట్లు విషయంలో కూడా యాజమాన్య వివాదాలు ప్రాజెక్టులను అడ్డుకోవడం ప్రారంభించాయి. లాండ్ పూలింగ్‌ను గుజరాత్‌లో 1976 కొత్తగా ఏర్పరచిన చట్టం ద్వారా  అమలుచేయడం ప్రారంభించారు. ప్లాట్ల యాజమాన్య వివాదాల సమస్యను 1999 లో టౌన్ ప్లానింగ్ స్కీమును ఆమోదించిన తర్వాత గుజరాత్‌ అధిగమించింది. వాళ్లు భూమిని స్వాధీనం చేసుకొని రోడ్లు వేయడం ప్రారంభించారు. ఫలితంగా భూముల ధరలు పెరిగాయి. గుజరాత్‌లో లాండ్ పూలింగు జనానికి ప్రోత్సాహమిచ్చింది.   లాండ్ పూలింగ్ అంటే అనేక భూ కమతాలను ఒకటిగా పూల్ చేసి భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఉపయోగించి మిగిలిన భూమిని భూ యజమానులకు అభివృద్ధి హక్కులతో తిరిగి ఇవ్వడం లాండ్ పూలింగ్ విధానం. ఇట్లా పూల్ చేసిన భూమిలో కొంతభాగా...

ChandraBabu Naidu - CBN

Image
చంద్రబాబు నాయుడు హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఒక రాజ్యాంగేతర శక్తిగా, అంతులేని అధికారాలున్న రాజకీయ అధికార కేంద్రంగా మారిందనడంలో సందేహం లేదు -  "నవ్యాంధ్ర తో నా నడక" 14. చంద్రబాబు పని శైలి చంద్రబాబు పనితీరు చాలా విచిత్రంగా ఉంటుంది.  ఏపని చేయాలనుకున్నా, ఎవర్ని నియమించాలనుకున్నా, ముందు రోజు ఆ విషయంపై లీకులు ఇస్తాడు. ఈ లీకుల్ని ఆయనకు అనుకూలంగా ఉన్న పత్రికలు, టీవీ ఛానెల్స్ ప్రచారం చేస్తాయి. దానిపై వచ్చిన ప్రతిస్పందన బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇది ఆయన సాధారణంగా అనుసరించే పద్ధతి. లేక ఆ నిర్ణయం వివాదాస్పదంగా, సంక్లిష్టంగా మారితే అందుకు బాధ్యతను ఎవరో ఒకరి పై తోసేసి తాను మాత్రం సురక్షితంగా ఉండాలని ప్రయత్నిస్తారు. చాలా సార్లు నిర్ణయాలకు బాధ్యతను అధికారులపైనే తోసేస్తారు. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆయన ఇదే పద్ధతిని అనుసరించాడు. ఉదాహరణకు గతంలో అదనంగా మద్యపు షాపులు ఇవ్వాలని నిర్ణయించారు. అప్పుడు పెద్ద గందరగోళం చెలరేగింది. మర్నాడు ఇది ఎవరు ఎందుకు చేశారు. అని ఆయన ఆరా తీసినట్లు, కమిషనర్‌పై ఆగ్రహించినట్లు పత్రికల్లో పతాకశీర్షికల్లో వార్తలు వచ్చాయి. మూడో రోజు తర్వా...

AP Formation Day

Image
"జైరాం రమేశ్ స్వయంగా ఏపీ భవన్‌కు వచ్చి చంద్రబాబునాయుడుకు సలహా ఇచ్చినందువల్లే ఇవాళ పోలవరంకు అడ్డంకులు తొలిగాయి " -  నవ్యాంధ్రతో నా నడక   13. ఆంధ్రప్రదేశ్‌కు అవతరణ దినోత్సవం లేదా?  జూన్ 2న రెండు రాష్ట్రాలు విడిపోయాయి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించింది కనుక జూన్ 2 ఆ ప్రాంతానికి ఒక మహత్తరమైన రోజు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం జూన్ 2న చాలా పెద్ద ఎత్తున అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది.  కాని తెలంగాణ నుంచి విడిపోయిన శేష ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు? జూన్ 2న ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయలేదు. అంతేకాక విభజన అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగాజరిగింది కనుక జూన్ 2న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సంబరాలు జరుపుకోవడంలో అర్థం లేదు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1న జరిగేది. కాని అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు. ఇప్పుడా విశాలాంధ్ర లేదు. కనుక నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవడం అర్థరహితం.  కాని ఆంధ్రప్రదేశ్ ఏదో ఒకరోజు అవతరణ దినోత్సవం జరుపుకోవాలి కదా.. అని ...

How and when Things Turned Sour

Image
"కుల రాజకీయాల్లో చిక్కుకుపోయిన వ్యవస్థలో ఆయన గురించి చెప్పేవారెవ్వరు? తెలుగువాడు కావడమే ఆయన దురదృష్టమా?" -నవ్యాంధ్ర తో న నడక 10. ఎప్పుడు, ఎలా, ఎందుకు చెడింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేను ఛీఫ్ సెక్రటరీ కావడం తృటిలో తప్పిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత శేష ఆంధ్రప్రదేశ్‌కు ఛీఫ్ సెక్రటరీ అవుతానని నేను అనుకోలేదు. కాని తెలుగుదేశం వేసుకున్న సామాజిక వర్గాల లెక్కల మూలంగా నాకు యాదృచ్ఛికంగా ఛీఫ్ సెక్రటరీ పదవి దక్కింది. కాని నేను ఛీఫ్ సెక్రటరీ అయిన రెండు నెలల్లోనే తనకూ, నాకూ భావసారూప్యత అంతగా లేదన్న విషయం చంద్రబాబు గ్రహించినట్లున్నారు. గ్రహించిన తర్వాత కీలకమైన నిర్ణయాల్లో నన్ను విశ్వాసంలోకి తీసుకోవడం మానివేశారు. నాకు తెలియకుండా నిర్ణయాలు జరిగేవి. నేనూ నా స్థాయి తగ్గించుకుని కలిసిపోవాలని ప్రవర్తించలేదు. నాకు నేను ఒక పరిధి ఏర్పర్చుకుని పనిచేయడం ప్రారంభించాను. చంద్రబాబు సమీక్షించని ప్రాజెక్టులు, కార్యక్రమాలపై దృష్టి పెట్టి ఛీఫ్ సెక్రటరీగా ప్రభుత్వ వ్యవస్థ సవ్యంగా సాగేలా చూసుకో సాగాను. తమకు అనుకూల నిర్ణయాలు తీసుకునేందుకు నేను అడ్డుగా ఉంటానని భావించారేమో నన్ను ఒకటి రెండు సార్లు తప్ప...