Posts

Showing posts with the label Ghost cities

Ghost Cities of China - Whose Capital Amaravthi

Image
14. చైనా ఘోస్ట్ నగరాలు - నేర్చుకోవలసిన పాఠాలు చైనా ఎంత వేగంగా నగరాలు నిర్మించిందంటే, జనం వాటిలోకి తరలిరావడానికి సమయం చాల లేదు. డిమాండు ననుసరించి పట్టణ ప్రాంతాలను క్రమంగా విస్తరించడానికి బదులు, చైనా పూర్తిగా కొత్తనగరాలను అన్నిటినీ ఒక్కసారిగా నిర్మించాలని తలపెట్టిందని ఆండ్రూ టరంటోలా తన వ్యాసంలో రాశాడు. ఇందులో ఒక లాభం ఉంది సెంట్రల్ ప్లానింగ్, సమగ్ర పట్టణ ప్రణాళికలకు అవకాశం ఏర్పడుతుంది. కాని మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడింది, ఎందుకంటే జనం ఆ నగరాలకు తరలడానికి ఇష్టపడలేదు. మొక్కజొన్న పొలాలలో నిర్మించిన న్యూ సౌత్ చైనా మాల్, దాన్ని ప్రారంభించిన దశాబ్దం తర్వాత కూడా 99% జనావాస రహితంగానే ఉండిపోయింది. దీన్ని 2005 లో 8,92,000 చదరపు మీటర్ల బిల్డప్ ఏరియాలో నిర్మించారు. తియాందు చెంగ్ హాంగ్ ఝాన్‌లో కొత్తగా నిర్మించిన తియాందు చెంగ్ నగరంలో జనమే లేరు. ఈ నగరంలో ఐఫెల్ టవర్‌కి ప్రతిరూపం ఉండడం విశేషం. 2003 లో సెంట్రల్ మంగోలియాలో ఉత్తర చైనా దుబాయిగా పిలిచే కాంగ్ బాషి రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్‌కు బలిపశువయింది. రియల్ ఎస్టేట్ స్పెక్యులేటర్లు ఈ నగరంలో చేరి సముచితమైన మార్కెట్ ధరలకంటే చాలా అధికం...