Posts

Showing posts with the label donakonda

Donakonda ,the Aborted Neutral capital-Whose Capital Amaravathi

Image
8. తటస్థ రాజధానిగా దొనకొండ: విఫలమైన ప్రతిపాదన కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా దొనకొండ ప్రతిపాదన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్‌గా నేను 2013 మేలో బాధ్యతలు చేపట్టాను. 2013 జులై 30 వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పదేండ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ప్రతిపాదస్తూ కొత్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటుకు తీర్మానం చేసింది. సిడబ్ల్యుసి తీర్మానం ఆమోదించడంతో రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయమై ఉందనీ, ఈ విభజన జరగడానికి సమయనిర్ణయమే జరగవలసి ఉందనీ అర్థమైపోయింది. నేను భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్ని కావడం వల్ల, రెవిన్యూమంత్రి కొత్త రాష్ట్ర రాజధాని స్థలానికి యోగ్యమైన స్థలాన్ని పరిశీలించవలసిందిగానూ, దానికోసం ప్రభుత్వభూమి, ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో అన్వేషించవలసిందిగానూ కోరారు. తదనుగుణంగా పని ప్రారంభించాను. విశాలమైన ప్రభుత్వ భూముల లభ్యతపై సమాచారం పంపవలసిందిగా కలెక్టర్లను కోరాను. అన్ని జిల్లాలనుండి సమాచారం సేకరించాను. ఈ సమాచర విశ్లేషణ వల్ల కొన్ని జిల్లాలలో తగినంత విశాలమైన ప్రభుత్వభూములు లభిస్తున్నాయనీ, ఆ భూములను రాజధానీనగర స్థాపనకు తేలి