Posts

Showing posts with the label SpecialCategoryStatus

World Bank and Amaravathi - Whose Capital Amaravathi

Image
11. ప్రపంచ బాంకు - అమరావతి స్పెషల్ కాటగిరీ స్టేటస్‌కు బదులుగా  భారతప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ పాకేజ్ స్కీము నుండి ప్రయోజనం పొందే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్టెయినబుల్ కాపిటల్ సిటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు ప్రపంచబాంకు ఋణానికి వెళ్లింది. వాస్తవానికి స్పెషల్ కాటగిరీ స్కీములో ఇఎపి ప్రాజెక్టుకు అప్పుగా కాక గ్రాంటురూపంలో సహాయం చేసే కొన్ని వాగ్దానాలున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల మౌలిక సదుపాయాలు, వరదల తగ్గింపు చర్యలు, సాంకేతిక సహాయం ఉంటాయి. ఈ ప్రాజెక్టు అవుట్ లే రూ॥ 5000 కోట్లు. ఇందులో రూ॥ 2000 కోట్లు ప్రపంచ బాంకునుండి అప్పుగా, రూ॥ 1000 కోట్లు ఆసియా అభివృద్ధి బాంకు (ఎడిబి) నుండి అప్పుగా, తక్కిన మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రావాలి. ఈ ప్రాజెక్టుకు ప్రపంచబాంకు నుండి అప్పు తీసుకునే విషయంపై స్థానిక ప్రజలకు ఎన్నో అభ్యంతరాలున్నాయి.  ప్రపంచ బాంకు నియమాలు, హద్దులను ప్రభుత్వం పాటించకుండానే అమరావతి ప్రాజెక్టుతో ముందుకు వెళ్లింది. అందువల్ల ప్రపంచ బాంకు ఒక ఇన్స్‌పెక్షన్ టీమును ఏర్పరచాలని నిర్ణయించింది. ఈ టీము తమ ఇన్స్‌పెక్షన్ రిపోర్టులో అనేక విషయాలను పేర్కొంది. ఆ ...

WHOSE CAPITAL AMARAVATHI - AMARAVATHI LOCATION

Image
1. అమరావతి ప్రదేశం ఈ నేపథ్యంలోనే పార్లమెంటుకు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2014 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో బిజెపి, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తెలంగాణ, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లుగా అపాయింటెడ్ డే 02-06-2014 న విభాజితమై ఉనికిలోకి వచ్చినప్పటికీ, 19 మంది మంత్రుల శ్రీ చంద్రబాబు నాయుడు మంత్రివర్గం జూన్ 8, 2014 న ప్రమాణస్వీకారం చేసింది. శుభముహూర్తంగా భావించిన ఆ రోజు గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో, ప్రమాణస్వీకార మహోత్సవం బహిరంగసభలో జరిగింది. ఆ సమయంలో రాజధానీనగరం నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంతంలోనో, మంగళగిరి పోలీస్ బెటాలియన్ ప్రాంతంలోనో ఏర్పడుతుందని చెప్పుకున్నారు. మంత్రివర్గంలో శ్రీ నారాయణ కూడా ఉన్నారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖలు ఇవ్వబడిన నారాయణ, ముఖ్యమంత్రితోపాటు రాజధానీనగర స్థలనిర్ణయంలో కీలకపాత్ర వహించవలసి ఉంది. ఆయన శాసనసభలో కాని, శాసన మండలిలో కాని అప్పటికి సభ్యుడు కాదు. తరువాత 2014 ఆగస్టులో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎన్నికల సమ...

ChandraBabu Naidu - CBN

Image
చంద్రబాబు నాయుడు హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఒక రాజ్యాంగేతర శక్తిగా, అంతులేని అధికారాలున్న రాజకీయ అధికార కేంద్రంగా మారిందనడంలో సందేహం లేదు -  "నవ్యాంధ్ర తో నా నడక" 14. చంద్రబాబు పని శైలి చంద్రబాబు పనితీరు చాలా విచిత్రంగా ఉంటుంది.  ఏపని చేయాలనుకున్నా, ఎవర్ని నియమించాలనుకున్నా, ముందు రోజు ఆ విషయంపై లీకులు ఇస్తాడు. ఈ లీకుల్ని ఆయనకు అనుకూలంగా ఉన్న పత్రికలు, టీవీ ఛానెల్స్ ప్రచారం చేస్తాయి. దానిపై వచ్చిన ప్రతిస్పందన బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇది ఆయన సాధారణంగా అనుసరించే పద్ధతి. లేక ఆ నిర్ణయం వివాదాస్పదంగా, సంక్లిష్టంగా మారితే అందుకు బాధ్యతను ఎవరో ఒకరి పై తోసేసి తాను మాత్రం సురక్షితంగా ఉండాలని ప్రయత్నిస్తారు. చాలా సార్లు నిర్ణయాలకు బాధ్యతను అధికారులపైనే తోసేస్తారు. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆయన ఇదే పద్ధతిని అనుసరించాడు. ఉదాహరణకు గతంలో అదనంగా మద్యపు షాపులు ఇవ్వాలని నిర్ణయించారు. అప్పుడు పెద్ద గందరగోళం చెలరేగింది. మర్నాడు ఇది ఎవరు ఎందుకు చేశారు. అని ఆయన ఆరా తీసినట్లు, కమిషనర్‌పై ఆగ్రహించినట్లు పత్రికల్లో పతాకశీర్షికల్లో వార్తలు వచ్చాయి. మూడో రోజు తర్వా...

My Relations With Telangana CM ,KCR -Navyandhratho na nadaka

Image
కేసిఆర్ ముఖం విప్పారింది. బొటన వేలు చూపించి ‘డన్’ అన్నారు. .... "నవ్యాంధ్ర తో నా నడక"   9. కేసిఆర్‌తో సంబంధాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకోసం నేనెంత పోరాడినా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు నేనంటే మంచి అభిప్రాయమే ఉండేదని తెలిసింది. ‘మీరంటే ఆయనకు అభిమానం.. మీ నిజాయితీని ఆయన గౌరవిస్తారు..’ అని రాజీవ్ శర్మ ఒక సందర్భంలో చెప్పారు. నేను కేసిఆర్ ను ఒకటి రెండు సందర్భాల్లో తప్ప కలుసుకోలేదు. కలుసుకోవాల్సిన అవసరం రాలేదు.  2015 డిసెంబర్ లో కేసిఆర్ ఆయుత చండీ యాగం తలపెట్టినప్పుడు మాత్రం ఆయనను కలుసుకునే అవకాశం లభించింది. అప్పుడు నేను ఛీఫ్ సెక్రటరీగానే ఉన్నాను.అప్పటికి నాకు ఆహ్వానం రాలేదు. యాగనిర్వాహకుల్లో ఒకరైన వెంకట రమణ శర్మ ఒకరోజు నాకు ఫోన్ చేశారు.  ‘యాగానికి ఎప్పుడు వస్తున్నారు సార్’ అని ఆయన అడిగారు.  ‘నాకు ఆహ్వానం అందలేదండీ’ అని చెప్పాను.  ఆయన ఆశ్చర్యపోయారు. ‘మీకు ఆహ్వానం లేకపోవడమేమిటి సార్, మీరు వస్తారన్న చర్చ కూడా జరిగింది. ఎక్కడో పొరపాటు అయినట్లుంది. ఉండండి. మీతో మళ్లీ మాట్లాడుతాను’ అని ఫోన్ పెట్టేశారు. సరిగ్గా మూడు నిమిషాల్లో ముఖ్యమంత్రి కార్యాలయం ...

"Our people briefed me"- Navyandhra tho na nadaka

Image
7. ‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మి’ 2015 జూన్ 1 సాయంత్రం T.V. పెట్టినప్పుడు ‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్‌మి’ ఉదంతం ప్రసారమవుతుంది. ఈ సంభాషణ వినగానే నాకు మతిపోయినట్లయింది. ఒక సిఎం ఎన్నికల అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు రావడం, ఆయన గొంతును కూడా వినిపించడంతో ఆయన ప్రతిష్ఠ దెబ్బతింటుందనే అనిపించింది. నిజానికి అంతకు ముందే తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్‌సన్ ఇంటికి వెళ్లి శాసన మండలి ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటువేసేందుకు అయనకు డబ్బులు ఇవ్వజూపినట్లు టీవీలు చూపించాయి. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రే ఫోన్‌లో మాట్లాడినట్లు చూపిస్తున్నారు.  సాయంత్రానికల్లా రాష్ట్ర సలహాదారు పరకాల ప్రభాకర్ స్వయంగా టీవీల ముందుకు వచ్చి జరిగిన దాన్ని ఖండించారు. ‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌గారికి ఇక్కడున్నటువంటి శాంతి భద్రతలు, ప్రజల యొక్క స్వేచ్ఛ, ప్రజల యొక్క ఆస్తులు, ముఖ్యమైనటువంటి సంస్థల విషయంలో బాధ్యత ఉన్నది. వారు బాధ్యత తీసుకోనప్పుడు, వారు దీన్ని నడపనప్పుడు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆంధ్ర...

Navyandhra tho na nadaka Hud-hud Cyclone

Image
టెలికమ్యూనికేషన్లను పునరుద్ధరించే విషయంలో ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌ను పబ్లిక్‌గా తిట్టి టీవీలో పబ్లిసిటీ పొందారు - "నవ్యాంధ్ర తో న నడక"   6. హుద్ హుద్‌లో తల మునకలు రాష్ట్ర విభజన జరిగి నాలుగు నెలలు కాలేదు, హుద్ హుద్ తుఫాను విశాఖను తాకి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. అక్టోబర్ 8న తుఫాను వచ్చే సూచనలు కనిపించాయి. అప్పటికి హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌లో నేను కొత్త బ్లాకులోకి షిఫ్టు కాలేదు. నేను చిన్నగదిలో పనిచేస్తున్నప్పుడే తుఫాను సమాచారం లభించింది. అండమాన్ వద్ద అల్పపీడనం పెను తుఫాను గాలిగా మారి అక్టోబర్ 12 నాటికి తీవ్రతరమై, కాకినాడ గోపాలపట్నం మధ్య తీరం దాటుతుందని తెలిసింది. ఆ విషయం నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెప్పాను. సరే, లెటజ్ ప్రిపేర్ అని ఆయన అన్నారు. ఆ రోజు మధ్యాహ్నమే హుద్ హుద్ తుఫానుకు సంసిద్ధతపై దాదాపు అన్ని విభాగాల అధిపతులతో సమావేశం ఏర్పాటు చేశాను. డీజీపి, అదనపు డీజీపీలు, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ కమాండెంట్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. 24గంటల పాటు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, ఫీల్డ్ ఆఫీసర్లను రంగంలోకి దించాలని, సెలవుల్లో ఉన్న అధికారులను వెనక్...

Navyandha tho na nadaka - Other division issues

పార్లమెంటులో ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిన ప్రకటనలో చాలా స్పష్టంగా విభజన జరిగిన నాటి నుంచి 14వ ఆర్థిక సంఘం నివేదిక అమలయ్యే సమయం వరకు రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తుంది అని పేర్కొన్నారు. .. " నవ్యాంధ్రతో నా నడక"      5. ఇతర విభజన అంశాలు సంస్థలను ఉద్యోగులను విభజించే ప్రక్రియకు అనుబంధంగా ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లో కొత్త రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేసే అంశాలను కొన్ని కొత్త ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసే విధి విధానాలను పొందుపరచటం జరిగింది.దీనిలో ముఖ్యమైనది కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వెంటనే దృష్టి పెట్టవలసిన అంశం 14వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ కోరికలు తెలియజేస్తూ ఒక నివేదిక సమర్పించడం.  రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 46 వ సెక్షన్ లో ఈ 14వ ఆర్థిక సంఘం ప్రస్తావన ఉన్నది. తదనుగుణంగా రాష్ట్రపతి రెండు కొత్త రాష్ట్రాలకు తమ అవార్డు ఇవ్వవలసిందిగా ఆర్థిక సంఘాన్ని కోరారు. ఈ సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ...

Navyandhra tho na nadaka - challenges in the division of Employees

Image
షెడ్యూల్డు 10 సంస్థలన్నిటిపై మా హక్కు గురించి మేము పోరాడినందువల్ల రెండు ప్రభుత్వాల మధ్య తీవ్ర వైషమ్యాలు తలెత్తాయి - "నవ్యాంధ్ర తో న నడక"   4. సంస్థలు, ఉద్యోగుల విభజనలో సవాళ్లు ఆంధ్ర ప్రదేశ్ విభజన అనేది విచిత్రమైనది. ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన వారు రాజధానికి దూరంగా ఉన్నారు. ఛత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు కావాలని ఉద్యమించిన ప్రాంతాల్లో సమైక్య రాష్ట్ర రాజధానులు లేవు. అవి తమ నూతన రాజధానులను, అందులో కొత్త సంస్థలను ఏర్పర్చుకోవాల్సి వచ్చింది. వాటికి పాత రాజధానుల్లోని సంస్థల్లో వాటాలను అడిగే అవకాశం లేకుండా పోయింది. విభజించడమే మహా ప్రసాదంగా భావించి, వారి ప్రాంతాలకు వెళ్లిపోయి పనులు ప్రారంభించుకున్నారు. ఉమ్మడి రాజధానిలో వాటా అడగలేదు, కేంద్రం ఇవ్వనూ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఉన్న ప్రాంతం నుంచి విభజన కోసం ఉద్యమం ప్రారంభమైంది. కనుక కొత్త ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నుంచి దూరంగా వెళ్లి పోవాల్సి వచ్చింది. అందువల్లే రాజధానిలో ఉన్న సంస్థల్లో వాటా కోసం అడగాల్సిన అవసరం ఏర్పడింది. ‘మమ్మల్ని మీరు వెళ్లిపొమ్మన్నారు. మా వాటా మాకివ్వండి. మేము వెళ్లిప...