Posts

Showing posts with the label ccla

Donakonda ,the Aborted Neutral capital-Whose Capital Amaravathi

Image
8. తటస్థ రాజధానిగా దొనకొండ: విఫలమైన ప్రతిపాదన కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా దొనకొండ ప్రతిపాదన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్‌గా నేను 2013 మేలో బాధ్యతలు చేపట్టాను. 2013 జులై 30 వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పదేండ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ప్రతిపాదస్తూ కొత్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటుకు తీర్మానం చేసింది. సిడబ్ల్యుసి తీర్మానం ఆమోదించడంతో రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయమై ఉందనీ, ఈ విభజన జరగడానికి సమయనిర్ణయమే జరగవలసి ఉందనీ అర్థమైపోయింది. నేను భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్ని కావడం వల్ల, రెవిన్యూమంత్రి కొత్త రాష్ట్ర రాజధాని స్థలానికి యోగ్యమైన స్థలాన్ని పరిశీలించవలసిందిగానూ, దానికోసం ప్రభుత్వభూమి, ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో అన్వేషించవలసిందిగానూ కోరారు. తదనుగుణంగా పని ప్రారంభించాను. విశాలమైన ప్రభుత్వ భూముల లభ్యతపై సమాచారం పంపవలసిందిగా కలెక్టర్లను కోరాను. అన్ని జిల్లాలనుండి సమాచారం సేకరించాను. ఈ సమాచర విశ్లేషణ వల్ల కొన్ని జిల్లాలలో తగినంత విశాలమైన ప్రభుత్వభూములు లభిస్తున్నాయనీ, ఆ భూములను రాజధానీనగర స్థాపనకు తేలి...

Swiss Challenge - Amaravati

Image
రాజధాని ఎంపిక నిర్ణయం కేవలం కొన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు హ్రస్వదృష్టితో తీసుకున్న నిర్ణయం - "నవ్యాంధ్ర తో నా నడక" 12. రాజధాని రాజకీయం జూన్ 2013లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అందరికీ రాష్ట్ర విభజన తప్పదన్న విషయం అర్థమైంది. రాజధాని ఎక్కడుంటే బాగుంటుందన్న విషయంపై చర్చలు ప్రారంభమయ్యాయి. అప్పుడు రఘువీరారెడ్డి రెవిన్యూ మంత్రి. ‘ఈ అంశాన్ని పరిశీలించి రాజధాని ఎక్కడుండాలో సూచించండి.’ అని నాకు చెప్పారు. నేను అప్పుడు  # సిసిఎల్‌ఎ  గా ఉన్నాను. అన్ని జిల్లాలనుంచి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయో వివరాలు తెప్పించాను. విశాఖలో అచ్యుతాపురం వద్ద, విజయవాడలో నూజివీడు దగ్గర, గుంటూరు వినుకొండ-మాచెర్ల దగ్గర, ప్రకాశంలో దొనకొండ దగ్గర పెద్ద ఎత్తున భూమి లభ్యమవుతుందని తెలిసింది. ఇక నెల్లూరు, అనంతపురం, ఇతర సీమ జిల్లాల్లో కూడా భూమి బాగానే లభ్యమవుతున్నది. కర్నూలులో అంత లేదు. వీటన్నిటినీ పరిశీలించి ఒక కాన్‌సెప్ట్ నోట్ తయారు చేశాను. ఇంకా శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేయనే లేదు. నేను ప్రభుత్వ భూములు లభించడమే ప్రాతిపదికగా తీసుకోకుండా రాజధాని ఏర్పాటుకు ఇతరత్రా కారణాల...

Navyandhra tho na nadaka Hud-hud Cyclone

Image
టెలికమ్యూనికేషన్లను పునరుద్ధరించే విషయంలో ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌ను పబ్లిక్‌గా తిట్టి టీవీలో పబ్లిసిటీ పొందారు - "నవ్యాంధ్ర తో న నడక"   6. హుద్ హుద్‌లో తల మునకలు రాష్ట్ర విభజన జరిగి నాలుగు నెలలు కాలేదు, హుద్ హుద్ తుఫాను విశాఖను తాకి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. అక్టోబర్ 8న తుఫాను వచ్చే సూచనలు కనిపించాయి. అప్పటికి హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌లో నేను కొత్త బ్లాకులోకి షిఫ్టు కాలేదు. నేను చిన్నగదిలో పనిచేస్తున్నప్పుడే తుఫాను సమాచారం లభించింది. అండమాన్ వద్ద అల్పపీడనం పెను తుఫాను గాలిగా మారి అక్టోబర్ 12 నాటికి తీవ్రతరమై, కాకినాడ గోపాలపట్నం మధ్య తీరం దాటుతుందని తెలిసింది. ఆ విషయం నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెప్పాను. సరే, లెటజ్ ప్రిపేర్ అని ఆయన అన్నారు. ఆ రోజు మధ్యాహ్నమే హుద్ హుద్ తుఫానుకు సంసిద్ధతపై దాదాపు అన్ని విభాగాల అధిపతులతో సమావేశం ఏర్పాటు చేశాను. డీజీపి, అదనపు డీజీపీలు, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ కమాండెంట్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. 24గంటల పాటు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, ఫీల్డ్ ఆఫీసర్లను రంగంలోకి దించాలని, సెలవుల్లో ఉన్న అధికారులను వెనక్...

Navyandha tho na nadaka - Other division issues

పార్లమెంటులో ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిన ప్రకటనలో చాలా స్పష్టంగా విభజన జరిగిన నాటి నుంచి 14వ ఆర్థిక సంఘం నివేదిక అమలయ్యే సమయం వరకు రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ లోటును కేంద్రం భర్తీ చేస్తుంది అని పేర్కొన్నారు. .. " నవ్యాంధ్రతో నా నడక"      5. ఇతర విభజన అంశాలు సంస్థలను ఉద్యోగులను విభజించే ప్రక్రియకు అనుబంధంగా ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లో కొత్త రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేసే అంశాలను కొన్ని కొత్త ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేసే విధి విధానాలను పొందుపరచటం జరిగింది.దీనిలో ముఖ్యమైనది కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వెంటనే దృష్టి పెట్టవలసిన అంశం 14వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ కోరికలు తెలియజేస్తూ ఒక నివేదిక సమర్పించడం.  రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 46 వ సెక్షన్ లో ఈ 14వ ఆర్థిక సంఘం ప్రస్తావన ఉన్నది. తదనుగుణంగా రాష్ట్రపతి రెండు కొత్త రాష్ట్రాలకు తమ అవార్డు ఇవ్వవలసిందిగా ఆర్థిక సంఘాన్ని కోరారు. ఈ సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ...

ACKNOWLEDGEMENTS By IYR KrishnaRao

Image
కృతజ్ఞతలు IYRKrishnaRao-   Navyandhratho na nadaka ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత వివిధ సమస్యల పరిష్కారంలో నా పాత్రను దగ్గరగా పరిశీలిస్తూ ఉన్న మిత్రుడు ఒకరు ఆ కీలక ఘట్టంలో ప్రత్యక్ష సాక్షిగా వున్న నేను నా అనుభవాలను జనంతో పంచుకుంటే బాగుంటుంది అని సూచించారు. ఇది మంచి ఆలోచనే అనుకున్నాను. నా పదవి విరమణ అనంతరం వెంటనే నా వ్యక్తిగత కార్యదర్శి శేషగిరికి కొన్ని వివరాలు డిక్టేట్ చేసాను. అయితే వెంటనే నేను మరో పదవీ బాధ్యత చేపట్టవలసి వచ్చింది. ఒకసారి ఈ బాధ్యతనుంచి కూడా బయటపడిన తరువాత భూపాలనా ప్రధాన కమీషనర్‌గా ఉన్నప్పటి నుండీ బ్రాహ్మణ కార్పొరేషన్ నుండి బయటికి వచ్చేంతవరకు జరిగిన విషయాలను కూడా చేర్చి దీన్ని విస్తరించాలనుకున్నాను. అందువల్ల ఈ పుస్తకంలో నేను CCLA గా వున్నప్పుడు ఎదుర్కొన్న చాలా ముఖ్యమైన భూమి కేసులలో నా అనుభవాలు కూడా చోటుచేసుకున్నాయి. అట్లాగే బ్రాహ్మణ కార్పొరేషన్ నుండి నేను బయటికి రావలసిన వాస్తవ పరిస్థితులను కూడా ఈ పుస్తకం వివరిస్తుంది. నన్ను బ్రాహ్మణ కార్పొరేషన్ నుండి తొలగించిన వెనువెంటనే పత్రికా విలేఖరుల సమావేశంలో దానికి కారణాలను వివరించే అవకాశం కలిగినప్పటికీ మరెన్నో విషయాలు...