AP Formation Day
"జైరాం రమేశ్ స్వయంగా ఏపీ భవన్‌కు వచ్చి చంద్రబాబునాయుడుకు సలహా ఇచ్చినందువల్లే ఇవాళ పోలవరంకు అడ్డంకులు తొలిగాయి " - నవ్యాంధ్రతో నా నడక 13. ఆంధ్రప్రదేశ్‌కు అవతరణ దినోత్సవం లేదా? జూన్ 2న రెండు రాష్ట్రాలు విడిపోయాయి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించింది కనుక జూన్ 2 ఆ ప్రాంతానికి ఒక మహత్తరమైన రోజు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం జూన్ 2న చాలా పెద్ద ఎత్తున అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది. కాని తెలంగాణ నుంచి విడిపోయిన శేష ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు? జూన్ 2న ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయలేదు. అంతేకాక విభజన అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగాజరిగింది కనుక జూన్ 2న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సంబరాలు జరుపుకోవడంలో అర్థం లేదు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1న జరిగేది. కాని అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు. ఇప్పుడా విశాలాంధ్ర లేదు. కనుక నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవడం అర్థరహితం. కాని ఆంధ్రప్రదేశ్ ఏదో ఒకరోజు అవతరణ దినోత్సవం జరుపుకోవాలి కదా.. అని ...