Amaravathi and other cities of AP - Whose Capital Amaravathi
13. అమరావతి - ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాలు అమరావతి, దాని అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతరనగరాల అభివృద్ధిని రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కుంటుపరిచే అవకాశం ఉంది. ‘Capital cities Varieties and Patterns of Development and Relocation’ అన్న తన పుస్తకంలో వాదిం రాస్‌మన్, కొన్ని ఆసక్తికరమైన పరిశీలనలు చేశాడు. తగినంత పరిమాణం కలిగిన బలమైన నగరాల నెట్‌వర్క్ ఉన్న దేశాలు, ప్రాంతాలలో రాజధానీనగరాలు స్వాభావికంగానే చిన్నవిగా ఉంటాయనీ, నగరాల నెట్‌వర్క్ చిన్నదిగా ఉండి నగరాలు పరిమాణంలోనూ, సంఖ్యలోనూ తక్కువగా ఉన్నప్పుడు రాజధానీనగరాల పరిమాణం పెద్దదిగా ఉంటుందనీ అతనంటాడు. మధ్యస్థాయి పరిమాణం గల అనేక పట్టణాల నెట్‌వర్కు, వైజాగ్, విజయవాడ, తిరుపతి అనే మూడు పెద్ద నగరాలు రాష్ట్రం మూడు ప్రాంతాలలోనూ ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టం. ఇటువంటి బలమైన నగరాల నెట్‌వర్కు ఉన్న రాష్ట్రంలో ఒక భారీ పరిమాణం గల హరితక్షేత్ర రాజధానీ నగరంపై ప్రత్యేక శ్రద్ధ శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు తేనెకుండ ప్రభావాన్ని చూపి, పెట్టుబడులు, నిధులు అన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ప్రస్తుతం ఉన్న నగరాల విస్తరణకూ, ఆ...