Posts

Showing posts with the label Inti

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు - విద్యార్థుల ఇబ్బందులు

Image
భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా చాలా ప్రధానమైనటువంటి ఘట్టం ఇంటర్మీడియట్ విద్య. విద్యార్థులు భవిష్యత్తులో ఏ వృత్తిలో ఉండాలనేది ఇప్పుడే నిర్ణయించబడుతుంది. ఉన్నత విద్యాస్థాయిలో ఒక విద్యా విభాగం నుంచి మరియు ఒక విభాగానికి మారే అవకాశం లేని భారతీయ విద్యా విధానంలో ఇంటర్మీడియట్ విద్య సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి విద్యార్థుల భవిష్యత్ విద్యే కాక వారి వృత్తిపరమైన నిర్ణయం కూడా జరుగుతుంది. తీసుకున్న సబ్జెక్టులను బట్టి భవిష్యత్తులో వారు డాక్టర్ల ఏది ఇంజనీర్ల ఏది ఇంకేదైనా వృత్తిలో స్థిరపడేది ఈ సమయంలోనే నిర్ణయించబడుతుంది. అందుకనే తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చదువులలో ఈ ఘట్టానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. వారితో పాటు శ్రమపడి వారు చక్కని ఫలితాలు సాధించడానికి తోడ్పడుతూ ఉంటారు. ఒకరకంగా మొత్తం కుటుంబం కలిసి తీసుకునే పరీక్ష ఇంటర్మీడియట్ పరీక్ష.ఇంత ప్రాధాన్యం కలిగిన ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రభుత్వాలు సక్రమంగా నిర్వహించకపోవడం కొత్తేమీ కాదు. ఇంతకుముందు చాలాసార్లు పరీక్ష పత్రాల లీకేజీ జంబ్లింగ్ విధానాల్లో లోపాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేశాయి. ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు నైతిక బా...