Posts

Showing posts with the label CANBERRA

Whose Capital Amaravathi - International Experience with Capital City Building

Image
3. రాజధానీనగర నిర్మాణంలో అంతర్జాతీయ అనుభవం పై సైద్ధాంతిక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రపంచవ్యాప్తంగా వివిధదేశాలలో రాజధానీనగరస్థలాల విషయంలో వాస్తవ అనుభవాలను పరిశీలించడం బాగుంటుంది. స్థూలవిశ్లేషణలో రాజధానీనగరాల స్థల నిర్ణయంలో పైవివరించిన ఒక సూత్రాన్నో, మరో సూత్రాన్నో లేదా ఆ సూత్రాల సమ్మిశ్రణాన్నో ఉపయోగించినట్లు తెలుస్తుంది. యుఎస్ఎ రాజధాని వాషింగ్టన్ డిసి అమెరికా సంయుక్తరాష్ట్రాల రాజధానీనగరంగా వాషింగ్టన్ డిసి రూపుదిద్దుకోవడం   వివిధ  దేశాలలో వివిధ ఫెడరల్ రాజధానీనగరాలకు స్ఫూర్తినిచ్చింది. వాషింగ్టన్ డిసి అమెరికా రాష్ట్రాలన్నిటి ప్రయోజనాలకూ సమప్రాధాన్యం వహించేటట్లు ప్రణాళికీకరించబడింది. తదనుగుణంగానే దాని పాలన బాధ్యత ఫెడరల్ ప్రభుత్వానిదే. స్థానిక పురపాలక వ్యవస్థ పాత్ర అత్యల్పం మాత్రమే.  అమెరికా దేశంలోని ఉత్తరదక్షిణ రాష్ట్రాల మధ్య సర్దుబాటుగా ఈ నగరం రూపొందింది. అంతర్యుద్ధానంతరం అప్పుల బాధ్యతను ఫెడరల్ ప్రభుత్వం స్వీకరించాలని ఉత్తర రాష్ట్రాలు కోరుకున్నాయి. దక్షిణ రాష్ట్రాలు దీనికి అభ్యంతరం తెలిపాయి. రాజీగా ఒక అంగీకారం కుదిరింది. రాజధానీనగరం దక్షిణ రాష్ట్రా...