Whose capital Amaravathi - Early designed Capital Cities of India
4. భారతదేశం ప్రణాళికీకరించిన తొలి రాజధానులు 1. పంజాబ్ , హర్యానాల రాజధాని చండీగఢ్ బ్రిటిష్ ఇండియా విభాజితమైనప్పుడు పంజాబు రాష్ట్రం భారత పాకిస్తాన్‌ల మధ్య విభాజితమైంది. పంజాబు రాష్ట్ర రాజధాని అయిన లాహోరు పాకిస్తాన్ భాగంలోకి వెళ్లింది. అందువల్ల భారత సమాఖ్యలో భాగమైన తూర్పు పంజాబుకోసం ప్రత్యేక రాష్ట్ర రాజధానిని నిర్మించవలసి వచ్చింది. దీనికితోడు పశ్చిమ పాకిస్తాన్ నుండి వస్తున్న కాందిశీకులకు నివాసస్థానం కల్పించడం కోసం ఒక నగరాన్ని నిర్మించవలసిన అవసరం కూడా ఏర్పడింది. ఈ రెండు ప్రయోజనాలనూ నెరవేర్చడానికి ఉపయోగపడేటట్లు చండీగఢ్‌ను ఒక ఆధునిక ప్రణాళికీకృత నగరంగా రూపొందించారు. ఆధునిక నగరంగా చండీగఢ్ అభివృద్ధిలో జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా శ్రద్ధ తీసుకున్నారు. రాజధాని చండీగఢ్ నిర్మాణంలో ఒక భవిష్యద్దృష్టి కనబరిచాడు. భారత స్వాతంత్ర్యానికది ప్రతీకగా ఉండాలని, గత సంప్రదాయ బంధాలు దాన్ని అడ్డుకోకూడదని, భవిష్యత్తుపై దేశ విశ్వాసానికది ఒక ప్రతిబింబంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డాడు. శివాలిక్ పర్వతశ్రేణి పాదాలవద్ద తగిన స్థలాన్ని ఎంపిక చేశారు. సమీపంలో చండీ మందిరపు చండీమాత పేరునే నగరం పేరుగా నిర్ణయించ...