Posts

Showing posts with the label swisschallenge

Swiss Challenge Singapore - Whose Capital Amaravathi

Image
12. స్విస్ ఛాలెంజి - సింగపూరు సంబంధం కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రణాళిక వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాను, వివరణాత్మక మాస్టర్ ప్లానుల రచన కోసం సింగపూరు ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రారంభిక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సింగపూరు ప్రభుత్వం ఉచితంగానే తయారుచేసింది. కాని వివరణాత్మక మాస్టర్ ప్లాన్ కోసం రాష్ట్రప్రభుత్వం సింగపూరు ప్రభుత్వానికి సంబంధించిన సుర్బానా సంస్థకు 12 కోట్ల రూపాయలు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి, స్టార్టప్ ఏరియాలో సీడ్ కాపిటల్ సిటీ నిర్మాణంలో సింగపూరు కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడంలో అనుసరించిన మొత్తం పద్ధతిని, ప్రక్రియను పరిశీలిస్తే, ఆ కంపెనీలకు కాంట్రాక్టు కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకున్నట్లు, తాము ముందే నిర్ణయించుకున్నట్లు సింగపూరు కంపెనీలకు ప్రాజెక్టు నివ్వడానికి కావలసిన ఔపచారిక ప్రక్రియను నిర్వహించినట్లు అనిపించక మానదు.  ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్విస్ ఛాలెంజి పద్ధతిని ఎంచుకుంది. కాని దాన్ని కూడా ఉన్నదున్నట్లుగా కాని, ప్రక్రియ విధి విధానాలను సక్రమంగా అనుసరించకుండా వక్ర మార్గంలో ఈ సి...

Sivaramakrishnan Commission- Whose Capital Amaravathi

Image
7. శివరామకృష్ణన్ కమిషన్ - అమరావతి రాజధానీనగర సైద్ధాంతిక నేపథ్యాన్నీ, అంతర్జాతీయ జాతీయ అనుభవాలనూ పరిశీలించిన తరువాత, ఈ  అధ్యాయంలో మన అమరావతి స్థల నేపథ్యాన్నీ, అమరావతికి సంబంధించిన ప్రత్యేక సమస్యలను విశ్లేషిద్దాం.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కింద సెక్షన్-6 ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానికి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి ఒక నిపుణుల కమిటీని నియమించడానికి అవకాశం ఇస్తుంది. తదనుగుణంగా భారతప్రభుత్వం శ్రీ శివరామకృష్ణన్ చైర్మన్‌గా ఒక కమిటీని నియమించింది. శ్రీ శివరామకృష్ణన్ భారతప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖకు మాజీ కార్యదర్శి. ఈ కమిటీ సభ్యులలో ఈ రంగంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డైరెక్టర్ డా. రతిన్ రాయ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ అర్బన్ ఎఫైర్స్ డైరెక్టర్ ప్రొ. జగన్ షా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ అరోమార్ రవి, స్కూల్ అఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డీన్, ప్రొ. రవీంద్రన్ ఉన్నారు.  ఈ కమిటీని నియమిస్తూ భారతప్రభుత్వం అది పరిశీలించవలసిన అంశాలలో స...

Swiss Challenge - Amaravati

Image
రాజధాని ఎంపిక నిర్ణయం కేవలం కొన్ని వర్గాలను సంతృప్తి పరిచేందుకు హ్రస్వదృష్టితో తీసుకున్న నిర్ణయం - "నవ్యాంధ్ర తో నా నడక" 12. రాజధాని రాజకీయం జూన్ 2013లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అందరికీ రాష్ట్ర విభజన తప్పదన్న విషయం అర్థమైంది. రాజధాని ఎక్కడుంటే బాగుంటుందన్న విషయంపై చర్చలు ప్రారంభమయ్యాయి. అప్పుడు రఘువీరారెడ్డి రెవిన్యూ మంత్రి. ‘ఈ అంశాన్ని పరిశీలించి రాజధాని ఎక్కడుండాలో సూచించండి.’ అని నాకు చెప్పారు. నేను అప్పుడు  # సిసిఎల్‌ఎ  గా ఉన్నాను. అన్ని జిల్లాలనుంచి ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయో వివరాలు తెప్పించాను. విశాఖలో అచ్యుతాపురం వద్ద, విజయవాడలో నూజివీడు దగ్గర, గుంటూరు వినుకొండ-మాచెర్ల దగ్గర, ప్రకాశంలో దొనకొండ దగ్గర పెద్ద ఎత్తున భూమి లభ్యమవుతుందని తెలిసింది. ఇక నెల్లూరు, అనంతపురం, ఇతర సీమ జిల్లాల్లో కూడా భూమి బాగానే లభ్యమవుతున్నది. కర్నూలులో అంత లేదు. వీటన్నిటినీ పరిశీలించి ఒక కాన్‌సెప్ట్ నోట్ తయారు చేశాను. ఇంకా శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేయనే లేదు. నేను ప్రభుత్వ భూములు లభించడమే ప్రాతిపదికగా తీసుకోకుండా రాజధాని ఏర్పాటుకు ఇతరత్రా కారణాల...