Special Category Status & Facts
ప్రత్యేక హోదా - విభజన అంశాలు: నిజానిజాలు ప్రత్యేక హోదా విభజన అంశాల విషయాల్లో ప్రజల మనస్సులో చాలా అస్పష్టత నెలకొని ఉన్నది. చాలామంది మిత్రులు నాకు తెలిసినంతవరకు అంశాలను వివరిస్తూ వివరణ ఇవ్వవలసిందిగా కోరుతున్నారు. దానికనుగుణంగా ఈ కింది సమాచారాన్ని ఉంచుతున్నాను 1.రాష్ట్రానికి రావాల్సిన మొత్తం ఎంత? వివిధ కమిటీలు ఏమి చెబుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఏర్పడిన జేఎఫ్ ఎఫ్ సి రిపోర్టు తయారు చేసే సమయంలో ఒక ప్రధాన అంశం చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారాన్ని సేకరించడానికి కానీ సంప్రదించడానికి గాని జే ఎఫ్ఎస్సి ప్రయత్నం చేయలేదు. కేంద్ర ప్రభుత్వ వాదన తెలియకుండా ఇంత మొత్తం కేంద్రం నుంచి రావాలి అని చెప్పడం సరైన విధానం కాదు అని భావించి జే ఎఫ్ ఎఫ్ సి 75 వేల కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవలసిన మొత్తంగా చూపెట్టారు కానీ ఇంత మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాలని చెప్పలేదు. జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ని స్వతంత్ర నిపుణుల కమిటీ తన అధ్యయనాన్ని ప్రారంభించినప్పుడు జే ఎఫ్ ఎఫ్ సి కి సాధికారత లేకపోవటంతో రిపోర్టుకు ప్రాధాన్యత లేకుండా పోయింది క...