WHOSE CAPITAL AMARAVATHI - AMARAVATHI LOCATION
1. అమరావతి ప్రదేశం ఈ నేపథ్యంలోనే పార్లమెంటుకు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2014 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో బిజెపి, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లుగా అపాయింటెడ్ డే 02-06-2014 న విభాజితమై ఉనికిలోకి వచ్చినప్పటికీ, 19 మంది మంత్రుల శ్రీ చంద్రబాబు నాయుడు మంత్రివర్గం జూన్ 8, 2014 న ప్రమాణస్వీకారం చేసింది. శుభముహూర్తంగా భావించిన ఆ రోజు గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో, ప్రమాణస్వీకార మహోత్సవం బహిరంగసభలో జరిగింది. ఆ సమయంలో రాజధానీనగరం నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంతంలోనో, మంగళగిరి పోలీస్ బెటాలియన్ ప్రాంతంలోనో ఏర్పడుతుందని చెప్పుకున్నారు. మంత్రివర్గంలో శ్రీ నారాయణ కూడా ఉన్నారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖలు ఇవ్వబడిన నారాయణ, ముఖ్యమంత్రితోపాటు రాజధానీనగర స్థలనిర్ణయంలో కీలకపాత్ర వహించవలసి ఉంది. ఆయన శాసనసభలో కాని, శాసన మండలిలో కాని అప్పటికి సభ్యుడు కాదు. తరువాత 2014 ఆగస్టులో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎన్నికల సమ...