Swiss Challenge Singapore - Whose Capital Amaravathi
12. స్విస్ ఛాలెంజి - సింగపూరు సంబంధం కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రణాళిక వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాను, వివరణాత్మక మాస్టర్ ప్లానుల రచన కోసం సింగపూరు ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రారంభిక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సింగపూరు ప్రభుత్వం ఉచితంగానే తయారుచేసింది. కాని వివరణాత్మక మాస్టర్ ప్లాన్ కోసం రాష్ట్రప్రభుత్వం సింగపూరు ప్రభుత్వానికి సంబంధించిన సుర్బానా సంస్థకు 12 కోట్ల రూపాయలు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి, స్టార్టప్ ఏరియాలో సీడ్ కాపిటల్ సిటీ నిర్మాణంలో సింగపూరు కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడంలో అనుసరించిన మొత్తం పద్ధతిని, ప్రక్రియను పరిశీలిస్తే, ఆ కంపెనీలకు కాంట్రాక్టు కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకున్నట్లు, తాము ముందే నిర్ణయించుకున్నట్లు సింగపూరు కంపెనీలకు ప్రాజెక్టు నివ్వడానికి కావలసిన ఔపచారిక ప్రక్రియను నిర్వహించినట్లు అనిపించక మానదు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్విస్ ఛాలెంజి పద్ధతిని ఎంచుకుంది. కాని దాన్ని కూడా ఉన్నదున్నట్లుగా కాని, ప్రక్రియ విధి విధానాలను సక్రమంగా అనుసరించకుండా వక్ర మార్గంలో ఈ సి...