Ghost Cities of China - Whose Capital Amaravthi

14. చైనా ఘోస్ట్ నగరాలు - నేర్చుకోవలసిన పాఠాలు

చైనా ఎంత వేగంగా నగరాలు నిర్మించిందంటే, జనం వాటిలోకి తరలిరావడానికి సమయం చాల లేదు. డిమాండు ననుసరించి పట్టణ ప్రాంతాలను క్రమంగా విస్తరించడానికి బదులు, చైనా పూర్తిగా కొత్తనగరాలను అన్నిటినీ ఒక్కసారిగా నిర్మించాలని తలపెట్టిందని ఆండ్రూ టరంటోలా తన వ్యాసంలో రాశాడు. ఇందులో ఒక లాభం ఉంది సెంట్రల్ ప్లానింగ్, సమగ్ర పట్టణ ప్రణాళికలకు అవకాశం ఏర్పడుతుంది. కాని మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడింది, ఎందుకంటే జనం ఆ నగరాలకు తరలడానికి ఇష్టపడలేదు. మొక్కజొన్న పొలాలలో నిర్మించిన న్యూ సౌత్ చైనా మాల్, దాన్ని ప్రారంభించిన దశాబ్దం తర్వాత కూడా 99% జనావాస రహితంగానే ఉండిపోయింది. దీన్ని 2005 లో 8,92,000 చదరపు మీటర్ల బిల్డప్ ఏరియాలో నిర్మించారు.


తియాందు చెంగ్

హాంగ్ ఝాన్‌లో కొత్తగా నిర్మించిన తియాందు చెంగ్ నగరంలో జనమే లేరు. ఈ నగరంలో ఐఫెల్ టవర్‌కి ప్రతిరూపం ఉండడం విశేషం. 2003 లో సెంట్రల్ మంగోలియాలో ఉత్తర చైనా దుబాయిగా పిలిచే కాంగ్ బాషి రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్‌కు బలిపశువయింది. రియల్ ఎస్టేట్ స్పెక్యులేటర్లు ఈ నగరంలో చేరి సముచితమైన మార్కెట్ ధరలకంటే చాలా అధికంగా కిరాయిలు పెంచారు. ఇది పౌరులు నగరంలో నివసించడానికి రాకుండా అడ్డుపడింది. 10 లక్షల జనాభా కోసం నిర్మించిన నగరంలో ఇప్పుడు 30,000 జనాభా మాత్రమే ఉంది.

ఝెంగ్ దాంగ్ నూతన ప్రాంతం

ఝెంగ్ దాంగ్ నూతనప్రాంతంలో గోధుమ పొలాల్లో శాన్ ఫ్రాన్సిస్కోకు రెండు రెట్లుండే మహానగరాన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో జనాభా పెరిగినప్పటికీ కొత్తజిల్లా ప్రాంతంలో పెరగలేదు. ఈ నగరాన్ని ఎవరికోసం నిర్మించారో వారు కిరాయిలు భరించే స్థితిలో లేరు.

చెంగ్ గాంగ్

కుమ్మింగ్‌లో వెల్లువెత్తుతున్న జనాభా కోసం చెంగ్ గాంగ్ నూతన ప్రదేశాన్ని నిర్మించారు. పూర్తిగా ఉపయోగానికి సిద్ధంగా ఉంది కాని జనం లేరు. మీరు నగరాన్ని నిర్మించినంత మాత్రాన దానిలో నివసించడానికి జనం వస్తారని లేదు.

కొత్త హరితక్షేత్ర నగరాల నిర్మాణంలో చైనా ప్రయోగం సరైన ప్రణాళిక, వాస్తవికమైన జనాభా అంచనాలు లేకుండా నగరాలు నిర్మించడం విఫలం కాక తప్పదని నిరూపిస్తుంది. అవి అవసరమైన జనాభాను ఆకర్షించలేవు. అతి స్పెక్యులేటివ్ కార్యకలాపాలు కొన్నిసార్లు వ్యతిరేకఫలితాలనిస్తాయి. ఏ జనాభా కోసం నగరం నిర్మించారో దాన్ని వారికే అందుబాటులో లేని ధరలు నిర్ణయించిన ఫలితమిది. అమరావతి నిర్మాణంలో చైనీయ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవాలి, ఎందుకంటే అమరావతి నిర్మాణం, వలసవచ్చే ప్రజల విషయంలో అవాస్తవికమైన అంచనాలపై ఆధారపడి జరుగుతూ ఉంది. అమరావతి నగరనిర్మాణం ప్రారంభం కాకముందే అది అతి స్పెక్యులేటివ్ కార్యక్రమాలకు బలి అయింది. అత్యంత ఆశావహమైన అభివృద్ధి అంచనాల పరంగా కూడా అది కొనసాగగలిగింది కాదు.

Comments

Popular posts from this blog

Whose Capital Amaravathi - Introduction

Urban centres as growth engines