My Tenure As CCLA And Some High Profile Land Cases
ఏ అధికారి అయినా ప్రభుత్వం ప్రయోజనాలను కాపాడాలని ప్రయత్నిస్తే - ? "నవ్యాంధ్ర తో న నడక"
11. గీత దాటిన మూర్తి
నేను మే 1, 2013న సిసిఎల్ ఏ గా బాధ్యతలు స్వీకరించాను, అప్పటి నుంచీ భూమి అంశాలపై దృష్టి కేంద్రీకరించడం ప్రారంభించాను.తెలంగాణ భూ అంశాలపై ఎక్కువ కేంద్రీకరించాను. ఎందుకంటే భూ అంశాలు తెలంగాణలో చాలా సంక్లిష్టమైనవి. సర్వే వ్యవస్థ అంత పకడ్బందీగా ఉండదు. రెండవది, నిజాం వారసులమని ప్రతి వాడూ ఏదో ఒక ఫర్మానా తెచ్చుకుని, ఎక్కడో ఏదో త్రవ్వి త్రవ్వి, భూములు తమవేనని చెప్పుకుంటారు.
కనుక ప్రభుత్వ భూములను పరిరక్షించి, సరిహద్దు గోడల్ని నిర్మించాలని నేను ప్రతిపాదించాను. ఇందుకు రు.30 కోట్లు బడ్జెట్‌లో కేటాయించేలా చూశాను.
హైదరాబాద్ లోనే కాదు మొత్తం రాష్ట్రమంతటా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములున్నాయో వాటిని, వివాదాస్పదంగా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న భూములను పరిరక్షించాలన్న ఉద్దేశంతో వాటికి సరిహద్దు గోడలు నిర్మించి వాటిపై గీతలు కూడా గీయించాను. ఆరోజు నేను చేసిన పనులు తర్వాత కాలంలో తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉపయోగపడ్డాయి. నిర్దిష్టంగా ఒక బడ్జెట్ పెట్టుకుని చేశాను.
ఆ రోజుల్లో షేక్‌పేట తహసీల్దార్‌గా చంద్ర కళ అనే మంచి అధికారిణి ఉండేది. ఆమె ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు.
హైదరాబాద్ తర్వాత నేను బాగా దృష్టి కేంద్రీకరించింది విశాఖపట్టణం.
హైదరాబాద్ తర్వాత నేను బాగా దృష్టి కేంద్రీకరించింది విశాఖపట్టణం.
విశాఖపట్టణంలో నాలుగు ప్రధాన కేసులు నా దృష్టికి వచ్చాయి. మొట్టమొదటిది #దసపల్లాహిల్స్ వ్యవహారం. సర్క్యూట్ హౌజ్ పక్కనున్న ప్రాంతాన్ని దసపల్లా హిల్స్ అంటారు. ఏ రకంగా చూసినా దసపల్లా హిల్స్ ప్రాంతం ప్రభుత్వ భూమే. అందులో సందేహం లేదు. కాని ఏళ్ల తరబడి దాన్ని వివాదాస్పదం చేసి దాన్ని ప్రైవేట్ భూమిగా మార్చారు. ఒక #సిసిఎల్ఏ టైమ్ లో దీనిపై చక్కటి ఆదేశాలు కూడా జారీ చేశారు. దానిపై ఆక్రమణదారులు ఈ కోర్టుకు, ఆ కోర్టుకు వెళ్లి లిటిగేషన్‌లో పెట్టారు. ప్రభుత్వం తరఫున సరిగా వాదించేవారు లేకపోయారు. వాళ్ళతో పాటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేతులు కలిపి మొత్తం మీద దాన్ని ప్రైవేట్ పరం చేశారు.
రాణీ కమలాదేవి అనే వ్యక్తికి ఆ భూమి ఇనామ్ లో ఉన్నదని చెప్పి తమ పరం చేసుకున్నారు. ఈ అంశంలో చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహించిన తహసీల్దార్ ఒకరుంటే ఆయనను నేను సస్పెండ్ చేశాను. నేనున్నంత కాలం అతడి విషయంలో గట్టిగా ఉన్నాను. నేను వెళ్లిన తర్వాత తిరిగి అదే స్థానంలోకి వచ్చాడు.
దీనికి అప్పటికే సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అక్కడ శేషాద్రి అనే మంచి కలెక్టర్ ఉండేవారు. ఆయనతో రివ్యూ పిటీషన్ వేయించాను. దాన్ని కూడా ఛీఫ్ సెక్రటరీగా నేను పదవీ విరమణ చేసిన తర్వాత కొట్టేశారు. ఆపైన వివరణకోసం కలెక్టరుగా ఉన్న యువరాజు క్యూరేటివ్ పిటిషన్ వేశారు. దానిపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేయలేదని తెలిసింది. ఆ భూమిలో తెలుగుదేశం కార్యాలయాన్ని పెట్టుకోవడంతో పాటు చాలా మందికి ఇచ్చేశారు. అందులో పెద్ద తలకాయలు చాలా మంది ఉన్నారు.
ఈ అక్రమాలపై ఇప్పటికీ పోరాడవచ్చు. క్రింది నుంచి గట్టిగా పకడ్బందీగా సాక్ష్యాధారాలు నిర్మించి, మోసం ఎక్కడ జరిగిందో నిర్ధారించి, క్రిమినల్ కేసు వేసి గెలిచి మళ్లీ కొత్త వాస్తవాలతో పై దాకా పోరాడితే విజయం తప్పక లభిస్తుంది. కాని అందుకు బలమైన రాజకీయ పట్టుదల ఉండాలి. అలాంటిది ఇప్పటి ప్రభుత్వానికి ఉన్నదని అనుకోను. అలా జరిగితే కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమి తిరిగి స్వాధీనం చేసుకుని రాష్ట్రం కోసం ఉపయోగించుకోవచ్చు.
రెండవది- భీముని పట్నం కోపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి సంబంధించిన వ్యవహారం. ఈ భూమి కేసులన్నీ 20 -30 ఏళ్ల నుంచీ తగాదాలో ఉన్నాయి. ఏ భూమి కేసు అయినా సుదీర్ఘ పోరాటం చేయాల్సిందే. ఇది కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్లి వాళ్లు గెలిచి వచ్చారు.
అది కూడా పక్కా ప్రభుత్వ భూమి. దాదాపు 400 ఎకరాలు ఉంటుంది. అక్కడ ఎర్రమట్టి దిబ్బలున్నాయి కనుక మేము ఇవ్వలేమని వాదించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఎర్రమట్టి దిబ్బలను భారత జియోలాజికల్ సర్వే సంస్థ కూడా చారిత్రక స్థలంగా గుర్తించింది. ఈ సొసైటీ సభ్యులంతా విశాఖకు చెందిన వారు కాదు. దానిపై దర్యాప్తు చేసి పిటిషన్ వేయమని చెప్పాను. కాని అది ఏదశలో ఉందో తెలియదు. గట్టిగా పోరాడి ఉంటే ఇది ప్రభుత్వానికే దక్కేది.
మూడవది, రామకృష్ణ బీచ్ ప్రాంతంలో అదనపు భూమి ఉన్నది. అర్బన్ భూమి సీలింగ్ చట్టం క్రింద ప్రభుత్వానికి వచ్చింది. దానిమీద ఎవరో కన్నేసి డాక్యుమెంట్లు సృష్టించి అది ప్రైవేట్ భూమి అని, తమ కోపరేటివ్ సొసైటీకి వస్తుందని తీసేసుకున్నారు. దీని మీద అసెంబ్లీలో గొడవ జరిగింది. దాడి వీరభద్రరావు ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై సిసిఎల్‌ఏ తో విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆరకంగా ఆ ఫైలు నా దగ్గరకు వచ్చింది.
ఈ భూమి కోసం ప్రభుత్వ స్థాయిలో చాలా అక్రమాలు జరిగాయని నాకు అర్థం అయింది. అక్రమ జీవోల వల్లే అక్రమణదారులకు ఆ భూమిపై అధికారం వచ్చింది. దీన్ని మొత్తం అధ్యయనం చేసిన తర్వాత దీనిపై పెద్దగా విచారణ జరిపించనక్కర్లేదని నాకు అనిపించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేస్తే చాలు అనుకున్నాను. జీవో రద్దు చేస్తే ఆక్రమించిన వారికి టైటిల్ పోయి ప్రభుత్వం స్వాధీనపరుచుకోవచ్చు అని ప్రభుత్వానికి లేఖ రాశాను. దర్యాప్తు కన్నా ఇది ముఖ్యం అని అనిపించింది.
కాని భూఆక్రమణదారు తెలివి ప్రయోగించి జీవో రద్దు చేయకుండా కేవలం దర్యాప్తు మాత్రమే చేయించమని కోరుతూ ప్రభుత్వం నేను పంపిన నివేదిక తిరిస్కరించేలా చేశాడు. ఇక చేసేది లేక నేను వెంటనే దర్యాప్తుకు తేదీలు ఇచ్చాను. ఆక్రమణదారు ‘నేను రష్యావెళ్లాను, మరో దేశం వెళ్లాను’ అని చెబుతూ తాత్సారం చేయడం ప్రారంభించాడు. ‘అలాగా, అయితే మీరు వెళ్లిన విమానం టిక్కెట్లు చూపించండి’ అని నోటీసు ఇచ్చాను. తుఫానులా అతడి వెంట పడ్డాను. ఆ వేడికి తట్టుకోలేక అతడు హైకోర్టుకు వెళ్లాడు. ‘ఈయన ఇప్పటికే జీవోను రద్దు చేయమని ప్రభుత్వానికి రాశారు. మామీద ఇప్పటికే ఒక అభిప్రాయం ఏర్పర్చుకున్నారు. కనుక దర్యాప్తు సాగించడానికి వీల్లేదు స్టే ఇవ్వండి.’ అని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. నేను సిసిఎల్‌ఏగా ఉన్నంతకాలం విచారణ జరిపించలేకపోయాను.
ఛీఫ్ సెక్రటరీ అయిన తర్వాత నేను విశాఖ వెళ్లాను. అప్పుడు యువరాజ్ కలెక్టర్‌గా ఉన్నారు. ‘యువరాజ్, అదేదో కేసు ఉన్నది. రామకృష్ణా బీచ్ దగ్గర ఆ భూములెలా ఉన్నాయో చూద్దాం పద..’ అన్నాను. ‘ఉన్నాయి సార్, బ్రహ్మాండంగా ఫ్లాట్లు వచ్చాయి.’ అని యువరాజ్ చెప్పారు. పోయి చూస్తే గేటెడ్ కమ్యూనిటీలో అందమైన ఫ్లాట్లతో కూడిన కాలనీ నిర్మాణమై కనిపించింది. ఇక దాన్ని వెనక్కి తీసుకోవడం ఎవరి తరం కాదని అర్థమైంది. అతడు టైటిల్ తెచ్చుకుని, మునిసిపాలిటీ వద్ద అనుమతులు తెచ్చుకుని పెద్ద కాంప్లెక్స్ కట్టాడు. మన కళ్ల ముందే ఇది జరిగింది.
భూమి కేసుల్లో అధికారులు పోరాడితే గెలిచే అవకాశం లేదని నా అనుభవం స్పష్టం చేసింది. ఏ అధికారి అయినా ప్రభుత్వం ప్రయోజనాలను కాపాడాలని ప్రయత్నిస్తే ఆయనకు ఎప్పటికైనా ఓటమి తప్పదు. ప్రభుత్వం మీకు మద్దతు నీయదు. ప్రభుత్వం పైకి మీకు కొంతకాలం మద్దతునీయవచ్చు. మంచి ముఖ్యమంత్రో, మంచి రెవిన్యూ మంత్రో ఉంటే ఇది జరుగుతుంది. కాని భూమి మీద కన్ను వేసిన వారికి దీర్ఘకాల వ్యూహం ఉంటుంది. వారు ఎంతకాలమైనా తాము అనుకున్నది సాధించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. గట్టి అధికారి ఉంటే అతడు తిరిగి వెళ్లేవరకూ అతడికి ఫైలు రాకుండా చూసుకుంటారు. అతడు వెళ్లిన తర్వాత తమకు అనుకూలమైన అధికారి వచ్చినప్పుడు ఫైలు చకచకా ముందుకు వెళ్లేలా చూసుకుంటారు.
సరైన స్థాయిలో రాజకీయ నాయకులకు ముడుపులు చెల్లించి డీల్స్ చేసుకుంటారు. ఇక ఫైలు ఆగమేఘాలపై కదులుతుంది. జీపీలను మేనేజ్ చేస్తారు. అధికార్లను మేనేజ్ చేసి కోర్టులో ప్రభుత్వ అభిప్రాయం సరిగ్గా చెప్పకుండా చూసుకుంటారు. ఏదో ఒక రకంగా తమకు అనుకూలమైన ఆర్డర్ తెచ్చుకుని ముందుకు వెళతారు. ఇప్పుడు మియాపూర్ కుంభకోణమైనా, విశాఖ కుంభకోణమైనా, దీర్ఘకాలంలో ఆ భూమిని ప్రభుత్వం పరిరక్షించలేదని తెలుసుకోవాలి.
మధ్యమధ్యలో మంచి అధికారులు వచ్చినా వారు ఏమీ చేయలేరు.
చివరిది, ఎంవిఎస్ మూర్తికి చెందిన గీతం యూనివర్సిటీ భూమి. నేను సిసిఎల్ఏ గా ఉన్న సమయంలో #గీతం యూనివర్సిటీ నుంచి ఒక అభ్యర్థన వచ్చింది. ‘తమ యూనివర్సిటీకి అనుబంధంగా 34 ఎకరాల భూమి ఉన్నది. మాకు కేటాయిస్తే మా సంస్థ బాగా అభివృద్ధి అవుతుంది’ అని కోరారు.
చివరిది, ఎంవిఎస్ మూర్తికి చెందిన గీతం యూనివర్సిటీ భూమి. నేను సిసిఎల్ఏ గా ఉన్న సమయంలో #గీతం యూనివర్సిటీ నుంచి ఒక అభ్యర్థన వచ్చింది. ‘తమ యూనివర్సిటీకి అనుబంధంగా 34 ఎకరాల భూమి ఉన్నది. మాకు కేటాయిస్తే మా సంస్థ బాగా అభివృద్ధి అవుతుంది’ అని కోరారు.
అప్పటికి రాష్ట్ర విభజనపై ఆమోద ముద్ర పడింది. సాధారణంగా అయితే ఈ భూమి విలువ చాలా ఉంది కనుక దాన్ని అలా కేటాయించడం సాధ్యపడదు. ఇక రాజధాని ఎక్కడో నిర్ణయం కాలేదు కనుక భూమిని వివిధ సంస్థలకు కేటాయించేందుకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయినా దాన్ని భూ కేటాయింపుల కమిటీకి నివేదించాం. కమిటీ గీతం అభ్యర్థనను తిరస్కరించింది.
ఈ భూమి ప్రజా ప్రయోజనాలకు అవసరం కనుక కేటాయించేందుకు కుదరదని స్పష్టం చేశాం.
ఎంవిఎస్ మూర్తి నాపై ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. నేను లొంగలేదు. ఒకరోజు ఒక జర్నలిస్టు మూర్తి తరఫున రాయబారానికి వచ్చారు.
అంతే కాదు, సిఎం ఆఫీసు నుంచి ఒత్తిడి పెరగడం ప్రారంభమయ్యింది.
ఒక సీనియర్ కాంగ్రెస్ నేత కూడా నాపై ఒత్తిడి తెచ్చాడు. ‘మీరేమైనా రాయండి. కాని ఫైలు మాత్రం సిఎం ఆఫీసుకు పంపండి’ అని కోరారు.
డబ్బు దగ్గర రాజకీయ ప్రయోజనాలు ఉండవు. మనీ ఈజ్ సెక్యులర్.
ఎంవిఎస్ మూర్తి నాపై ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. నేను లొంగలేదు. ఒకరోజు ఒక జర్నలిస్టు మూర్తి తరఫున రాయబారానికి వచ్చారు.
అంతే కాదు, సిఎం ఆఫీసు నుంచి ఒత్తిడి పెరగడం ప్రారంభమయ్యింది.
ఒక సీనియర్ కాంగ్రెస్ నేత కూడా నాపై ఒత్తిడి తెచ్చాడు. ‘మీరేమైనా రాయండి. కాని ఫైలు మాత్రం సిఎం ఆఫీసుకు పంపండి’ అని కోరారు.
డబ్బు దగ్గర రాజకీయ ప్రయోజనాలు ఉండవు. మనీ ఈజ్ సెక్యులర్.
నాకు తెలుసు ఈ ప్రభుత్వం మూడు నెలల కంటే ఎక్కువ ఉండదని. ఎంవిఎస్ మూర్తికి ఈ భూమి రావడానికీ రాకపోవడానికీ మధ్య ఈ ఫైలు మాత్రమే ఊగిసలాడింది. ఎంత ఒత్తిడి తెచ్చినా నేను ఫైలు పంపలేదు. ఈ విషయంలో శాశ్వతంగా బుద్ధి చెప్పాలని భావించి, హైదరాబాద్‌లో సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్‌ను, ఆదాయపన్ను కమిషనర్‌ను, కస్టమ్స్ కమిషనర్‌ను, ఇతర డిపార్ట్‌మెంట్ వాళ్లను పిలిచాను. ‘మీకు విశాఖలో ఏమైనా భూమి కావాలా?’ అని అడిగాను. వారికి నిజంగా అవసరం ఉన్నది. సెంట్రల్ ఎక్సైజ్ వాళ్లు మూడు ఎకరాలు అడిగారు. ఆదాయపన్ను వాళ్లు మరో రెండెకరాలు అడిగారు. సామాజిక సంక్షేమ శాఖ హాస్టల్ నిర్మాణానికి ఒక ఎకరం కావాలంది. ఇలా రకరకాల శాఖలు తమ అవసరాలను వెల్లడించాయి. ప్రభుత్వ భూమిని, ప్రభుత్వ శాఖలకు కేటాయించేందుకు ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదు...
అందుకే ఈ 34 ఎకరాలు ఫలానా ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తున్నానని నేనే ఉత్తర్వులు జారీ చేసి ప్రభుత్వానికి రాటిఫికేషన్ కొరకు పంపాను. ఫలానా ఫలానా విభాగాలు తమ అవసరాలకు భూమి కావాలని అడిగాయని, అందుకు తగ్గట్లుగా భూమిని కొలిచి ఆయా శాఖలకు కేటాయించి భూమిని స్వాధీనపరచవలసిందిగా నేను విశాఖ కలెక్టర్‌కు గట్టిగా చెప్పాను.
ఈ లోపు గీతం యూనివర్సిటీ వాళ్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాను యూనివర్సిటీ కోసం ఆ భూమిని అడిగానని, తనకివ్వకుండా ఉండేందుకే ఈ ప్రభుత్వ శాఖలకు కేటాయించారు అన్నది ఆయన అపీల్. కాని అప్పటికే భూమిని ప్రభుత్వ సంస్థలకు స్వాధీనం చేయడం జరిగిపోయింది. ఆ సంస్థలేవీ నిర్మాణాలు చేయలేదు. ఎందుకంటే స్టే ఉన్నదని ఆగిపోయాయి.
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వమే చూసుకుంటుందని నేను మిన్నకుండిపోయాను. మూర్తి ఒకటి రెండు సార్లు నా చుట్టూ తిరిగారు. జిల్లా కలెక్టర్ ‘ఏమి చేద్దాం సార్’ అని అడిగారు. ‘నీవు ఏం చేయగలిగితే అది చేయ్’ అన్నాను ఎందుకంటే నేను కేసు బలంగా బిగించి పెట్టాను. దాన్ని సులభంగా విస్మరించలేరని నాకు తెలుసు.
నా ఛీఫ్ సెక్రటరీ పదవీకాలం పూర్తయ్యాక మళ్లీ కదల్చే ప్రయత్నం చేశారు.
2017 మే 17న కేబినెట్‌లో ఈ విషయం తీసుకువచ్చి ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని #చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రతిపాదించింది.
ప్రభుత్వానికి చెందిన భూములను కేటాయించేందుకు మార్గదర్శక సూత్రాలున్నాయి. ఒకటి – ప్రభుత్వ విభాగాలకు ప్రాధాన్యతనీయాలి. రెండవది- ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యతనీయాలి. మూడవది. అర్హులైన ప్రైవేట్ పార్టీలకు ఇవ్వాలి.
2017 మే 17న కేబినెట్‌లో ఈ విషయం తీసుకువచ్చి ప్రభుత్వ శాఖలకు కేటాయించిన భూమిని రద్దు చేయాలని #చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రతిపాదించింది.
ప్రభుత్వానికి చెందిన భూములను కేటాయించేందుకు మార్గదర్శక సూత్రాలున్నాయి. ఒకటి – ప్రభుత్వ విభాగాలకు ప్రాధాన్యతనీయాలి. రెండవది- ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యతనీయాలి. మూడవది. అర్హులైన ప్రైవేట్ పార్టీలకు ఇవ్వాలి.
ఇలా మార్గదర్శక సూత్రాలున్నప్పుడు ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వ విభాగాలకు ఇచ్చిన భూమిని రద్దు చేసి ఇంకొకరికి కేటాయించాలని ప్రయత్నం చేయడం ఎంత ఘోరం.
మొదట చంద్రబాబు ఈ భూమిని ప్రభుత్వ రంగ సంస్థలకు రద్దు చేసి గీతంకు ఇవ్వాలన్న మూడ్‌లోనే కేబినెట్‌కు తీసుకువెళ్లాడు. గీతం తరుఫున వాదించారు. ‘మీకు తెలుసు కదా. గీతం యూనివర్సిటీ ఎంత ప్రతిష్ఠాత్మకమైనదో. ఆయన ప్రక్కనే ఉన్న భూమిని అడిగితే రాజశేఖర్ రెడ్డి కావాలని కక్ష కట్టి టార్గెట్ చేసి ఆ భూమి రాకుండా చేశారు’ అని చంద్రబాబు చెప్పారని తెలిసింది.
దీనికి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అడ్డుపడ్డారు. ‘మీరంటున్నది కరెక్టు కాదు సార్. ఇది రాజశేఖర్ రెడ్డి పీరియడ్‌లో జరిగింది కాదు. కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు దాన్ని మార్చి మనం ఇవ్వడానికి ప్రయత్నించడం బాగుండదు. కరెక్టు కాదు’ అని చెప్పారు. సిఎం ఏమీ అనలేకపోయారు. ‘కనీసం కేటాయింపులను రద్దు చేద్దాం’ అని రద్దు చేయించారు. గీతంకు ఇవ్వలేదు కాని ప్రభుత్వ సంస్థలకు భూమి ఇవ్వడాన్ని రద్దు చేశారు.
తమ వ్యాపారాలను అక్రమంగా విస్తరించేందుకే కాపాడుకునేందుకే చాలా మంది రాజకీయాల్లో చేరుతారు. నన్ను #బ్రాహ్మణకార్పోరేషన్ పదవి నుంచి తీసేశాక ఎంవిఎస్ మూర్తి ‘దరిద్రం వదిలిపోయింది’ అని వ్యాఖ్యానించారు. నిజమే. మరి వైజాగ్ లో 34 ఎకరాల దరిద్రంఉంది కదా మరి!
Very sorry Mr.Keishna rai to learn how your commitment to this state has been belittled by the vested interests of politicians in power and powerful caste sections across the state whose lobbying and resorting to courts with easy money is so overwhelming
ReplyDelete