అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు_రైతుల హక్కులు
ఈమధ్య గుజరాత్ రాష్ట్రంలో పెప్సీ కంపెనీ వారు రైతుల పైన కోర్టులో కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ కేసులు వేశారు. తాము సంపాదించిన పేటెంట్ కు విఘాతం కలిగించే విధంగా విత్తనాలు ఉపయోగించి వ్యవసాయం చేశారనేది వారి మీద మోపబడిన ప్రధాన అభియోగం. 2001వ సంవత్సరంలో రూపొందించిన మొక్కలలో రకాలు రైతుల హక్కుల పరిరక్షణ చట్ట(plant varieties and farmers rights protection act ) ఉల్లంఘన కు రైతులపై ఈ కేసు పెట్టడం అయింది. 1989వ సంవత్సరం నుంచి భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం తో మొదలుపెట్టి ఒప్పంద వ్యవసాయ విధానం ద్వారా(contract farming) వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు అమ్మకం చేస్తూ ఉన్న పెప్సీ కంపెనీ దాదాపు 30 సంవత్సరాల అనుభవం తరువాత ఈరోజు రైతులపై కేసులు పెట్టటం కొంత విచిత్రంగానే కనిపిస్తుంది. కానీ పెప్సీ కంపెనీ పెట్టిన ఈ కేసులో మూలంగా మొక్కలలో రకాలు రైతుల ప్రయోజనాల పరిరక్షణ చట్టంలోని కొన్ని లొసుగులు అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పై చట్టంలో సెక్షన్ 39 క్రింద వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ గురించి చెప్పడం జరిగింది. బ్రాండింగ్ చేసి వాణిజ్యపరంగా అమ్మ నంతవరకు వ్యవసాయ దారుల చేత రక్షిత వంగడాల వాడకాన్ని ఈ సెక్షన్ కింద పరిరక్షించటం జరిగింది. కానీ ఇదే చట్టంలో సెక్షన్ 28 కింద కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన సంస్థలకు తాము కానీ తమ చేత లైసెన్స్ ఇవ్వబడిన వ్యక్తులు గాని ప్రత్యేకంగా వినియోగించే అవకాశాన్ని కల్పించింది.ఈ రెండు సెక్షన్ల లోని పరస్పర విరుద్ధ అంశాలను ఈ కోర్టు కేసుల లో కోర్టులు పరిష్కరించాల్సి ఉంటుంది. ఈనాడు పెప్సీ కంపెనీ ఈ అంశాలను కోర్టు బయట పరిష్కరించుకోవటానికి సుముఖత చూపటం బట్టి ఈ అంశాలు ఇప్పట్లో కోర్టుల్లో తేలే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ఉదంతం నుంచి మన దృష్టికి వచ్చిన ప్రధానమైన అంశాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
1. ప్రపంచ వాణిజ్య సంస్థకు అనుబంధంగా తయారైన trips లాంటీ మేధో సంపత్తి హక్కుల నుంచి భారత ప్రభుత్వం బయటకి వచ్చే అవకాశం ఉందా!
2. బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఒప్పంద వ్యవసాయ విధానానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా.
3. రైతుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి.
ఈ మూడు అంశాలు ఒక్కొక్కటి పరిశీలిద్దాం.
ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) ఏర్పాటు కావడానికి ముందు వ్యవసాయ పరిశోధన వంగడాల అభివృద్ధి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో జరుగుతూ ఉండేది. ఈ సంపద అంతా జాతీయ సంపదగా పరిగణించడం జరిగింది కాబట్టి పరిశోధనకు అవసరమైన టువంటి నిధులు ప్రజాధనం ద్వారా సమకూర్చారు కాబట్టి ఈ పరిశోధన వల్ల వచ్చే ఫలితాలు అందరు రైతులకు అందుబాటులో ఉండేవి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో ఈ విధానం మారింది. మేధోసంపత్తికి పరిహారం సమకూర్చే విధంగా trips అగ్రిమెంటు ప్రపంచ వాణిజ్య సంస్థ విధి విధానాల్లో భాగంగా పొందుపరచటం జరిగింది. ఈ మొత్తం ప్రక్రియ అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యతిరేకంగా నడిచింది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ముందు పారిశ్రామిక సర్వీస్ రంగాల్లో డబ్ల్యుటివో ద్వారా సరళీకృత విధానాలను విజయవంతంగా ప్రవేశపెట్టి trips అగ్రిమెంట్ ద్వారా పేటెంటింగ్ కాపీరైట్ చట్టాలను బలపరిచి అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రయోజనాలను పూర్తిగా పరీక్షించుకున్నారు. వ్యవసాయ రంగంలో సరళీకృత విధానాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేసినా దోహా రౌండ్ చర్చలు విఫలం కావడంతో వ్యవసాయ రంగ సరళీకృత విధానాల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వచ్చే ప్రయోజనాలు ఎండమావులుగానే మిగిలిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీ లు అంతకుముందు లాగానే కొనసాగుతున్నాయి. పూర్తిగా వ్యవసాయరంగం సరళీకృతం చేయబడి అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగానికి సబ్సిడీలను నియంత్రణ చేయగలిగే ఉంటే అభివృద్ధి చెందే దేశాల వ్యవసాయ ఉత్పత్తులకు అభివృద్ధి చెందిన దేశాలలో విస్తృత మార్కెట్ ఏర్పడి ఉండేది. తదనుగుణంగా ఇక్కడి రైతుల ఆదాయాలు గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండేది. వ్యవసాయ రంగంపై జరిగిన దోహా రౌండ్ చర్చలు విఫలం కావటంతో అటువంటి అవకాశం లేకుండా పోయింది.
డబ్ల్యుటివో సంస్థ ఆధ్వర్యంలోని trips agreement ద్వారా వచ్చిన మేధో సంపత్తి పరిరక్షణ విధానానికి అనువుగా మన చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒక విధంగా డబ్ల్యూటీవో చట్రంలో trips చక్రంలో ఇతర దేశాలతో పాటు మనం కూడా బంధింపబడ్డాం. తదనుగుణంగా మన చట్టాల్లో తెచ్చిన మార్పు 2001 సంవత్సరంలో ని మొక్కలలో రకాలు వ్యవసాయ దారుల హక్కుల పరిరక్షణ చట్టం(plant varieties and farmer's interests protection act). ఈ చట్టం కింద నే ఈరోజు పెప్సీ కంపెనీ గుజరాత్లో రైతుల మీద కేసులు పెట్టింది. అంతర్జాతీయ ఒప్పందాల దృష్ట్యా ఈ చట్టాన్ని రద్దు చేసుకునే అవకాశం లేనందువల్ల చట్టం లోపలే ఏ విధంగా వ్యవసాయ దారుల హక్కులను పరిరక్షించాలి అనే అంశం పైన ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది.
ఇక రెండో ప్రధానమైన అంశం ఈ బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఒప్పంద వ్యవసాయానికి(contract farming) ప్రత్యామ్నాయ విధానం ఏమైనా ఉందా! కొంతవరకు సహకార వ్యవసాయ విధానం ఈ ఒప్పంద వ్యవసాయ విధానానికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయవచ్చు. కానీ దీనికి బలమైన నాయకత్వం అవసరం ఎంతైనా ఉంది. సహకార రంగంలో ఒక అమూల్ సంస్థ తప్పితే దేశంలో ఇంకెక్కడ సహకార సంస్థలు బలపడి రైతులకు దీర్ఘకాలంలో ప్రయోజనం కల్పించిన దాఖలాలు కనిపించడం లేదు. బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఒప్పంద వ్యవసాయ విధానంలో రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి అనేది కూడా వాస్తవం. మొట్ట మొదటిది అంతర్జాతీయ మార్కెట్ ను చిన్నకమతాల రైతుల ను అనుసంధానం చేసే సామర్థ్యం బహుళజాతి సంస్థల కే ఉంటుంది. నాణ్యమైన వంగడాల సరఫరా, వ్యవసాయ ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో నిల్వ చేయటం ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించటం తద్వారా వ్యవసాయోత్పత్తుల విలువను పెంచటం ఈ బహుళ జాతి సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది. సరైన ప్రత్యామ్నాయం వాటికి లేదు కనుక వ్యవసాయ రంగంలో కొన్ని పరిమితులు షరతులకు లోబడి పనిచేసే విధంగా బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో ఒప్పంద వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఆదాయం పెరగడానికి దోహదపడుతుంది.
కానీ ప్రభుత్వాలు ఈ బహుళ జాతి సంస్థల పై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.రైతు సంక్షేమం దృష్ట్యా య అవి పని చేస్తాయి అనుకుంటే అది మన భ్రమే.
కేవలం లాభాపేక్షతో నే ఈ కంపెనీలు తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి.అటువంటి లాభాలను రక్షించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు చిన్న సన్నకారు రైతుల పైన కూడా కోటి రూపాయల వరకు నష్టపరిహారం కోరుతూ పెప్సీ కంపెనీ గుజరాత్లో కోర్టులో దావా వేయటానికి వెనకాడలేదు. వ్యవసాయం చేసుకోవలసిన రైతులను కక్ష దారులుగా మారిస్తే పరిమితి లేని వనరులున్న ఈ బహుళ జాతి సంస్థల పై రైతులు పోరాటం చేసే పరిస్థితే లేదు. బహుళజాతి సంస్థలు సరఫరా చేసిన విత్తనాలు మొలకెత్తక పోయిన, లేక ఈనాడు గుజరాత్ లో లాగా వారి హక్కులను అతిక్రమించారని కేసులు వేసిన వ్యక్తిగతంగా రైతు ఈ సంస్థలతో పోరాటం జరిపే పరిస్థితి లేదు.
ఇక్కడనే ప్రభుత్వాలకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది. బహుళజాతి సంస్థలతో ఉత్పన్నమైన ఎటువంటి కేసుల విషయంలో కూడా రైతుల తరపున పోరాడే బాధ్యత ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన సంస్థ స్వీకరించాలి.పూర్తిగా వ్యాజ్యం అయ్యే ఖర్చులు ఈ సంస్థ భరించే విధంగా మార్పులు తీసుకురావాలి.రైతులు కేవలం వ్యవసాయానికే పరిమితం చేసి అనవసరమైన కోర్టు కేసులు వారి నెత్తి మీద లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ సంస్థ రైతులకు అండగా కోర్టు కేసులు నడపటానికి అనువుగా చట్ట సవరణ ప్రభుత్వం తీసుకు రావాలి. అట్లాగే ఆ సంస్థలకు కావలసిన ఆర్థిక పరిపుష్టిని ఏర్పాటు చేయాలి. అప్పుడే నిర్భయంగా వ్యవసాయదారుడు బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వ్యవసాయ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడంలో నిమగ్నం కాగలుగుతాడు.
ఇంకొక ప్రధాన విషయం
మనదేశంలో ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు పూర్తిగా పేటెంట్ విధానానికి వెళ్లకుండా రైతుల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని sui generis విధానంలో ఈ మొక్కలు రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టం అమలులో ఉండి 20 సంవత్సరాలు అవుతుంది కనుక ఇది ఎంతవరకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి లో సఫలీకృతమైంది అనే విషయాన్ని ఒకసారి సమీక్షించుకొని trips విధానానికి ప్రతికూలం కానంతవరకు తగిన మార్పులను వ్యవసాయ దారుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది.

పీ వీ పీ & యఫ్ ఆర్ చట్టం 2001 వలన ,రైతులకు 39 వ సెక్షన్ రక్షణ కల్పిస్తున్నది.. కంపెనీల బ్రాండెడె వెరైటీలకు 64 సెక్షన్ రక్షణ కల్పిస్తున్నది.
ReplyDeleteఅలాగే మన దేశ పేటెంట్ చట్టం 3j , మొక్కల పైనా , విత్తనాల పైన పేటెంట్ లేదన్నది..
Sui generics విధానాన్ని అనుసరించటంవలన మనకు కొన్ని వెసులుబాటులు కలిగాయి.
ఈ రెండు చట్టాలలో వున్న రైతు రక్షణలను తమరు గమనించారో లేదో తెలియదు.
పెప్సీ కంపెనీ , ఈ రైతు రక్షణ సెక్ష న్ లను గమనించినతరువాత, రైతు సంఘాల, మేధావుల ఆందోళన తరువాత, ప్రభుత్వం నిశ్శబ్దం. తరువాత తోకముడిచి కేసులను రద్దు చేసుకున్నది.
మన రైతులకు కూడా చట్టపరంగా వున్న కొన్ని రక్షణలు ఉఫయోగించుకునే విధంగా మీబోటి వారి ప్రోత్సాహం రైతులకు కావాలి. మీబోటి వారి ప్రోత్సాహం వుంటే రైతుల హక్కులు రక్షంచబడతాయి. మీరంటున్న బహుళ జాతి కంపెనీల ద్వారా మనకు లభంచే అభివృధి , చిప్స్కు, చిరుతిళ్ల కు, శీతల పానీయాలకు పరిమితమయి లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు జమ అవుతున్నాయి.
ప్రపంచం లో ఎక్కడా రైతులపై పెట్టిన కేసులను MNC లు రద్దు చేసుకోలేదు. రైతుల, రైతు సంఘాల, మేధావుల ఆందోళన తరువాత, ప్రభుత్వం నిశ్శబ్దం. తరువాత కేసులను రద్దు చేసుకున్నది. భారత దేశం లోనే ఇలా జరిగింది. MNC లను ఎదుర్కోవటం అసాధ్యం కాదని నిరూపించి , దేశ ప్రజల ఐక్యతను నిరూపించారు. మీబోటివారు రైతులకు అండగావుంటే రైతులు ఏదైనా సాధించగలరు.-
డాక్టర్ కొల్లా రాజమోహన్.
Sir, I want to meet you. Please. My email is balijapalli@gmail.com
ReplyDelete