స్వయంకృత పరాభవం

విశ్లేషణ 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నికలకు ముందు వచ్చిన సర్వేలు ఎన్నికల వెంటనే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు పేర్కొన్నప్పటికీ చాలామంది ఇంత అనూహ్యమైన విజయం వైఎస్సార్‌సీపీకి, తెలుగుదేశానికి పరాజయం ఊహించలేదు. హైదరాబాద్‌లో ఉన్న ఒక సంస్థ ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ఎన్నికలలో బాబు గారు ఊహించలేనంత పరాజయాన్ని చవిచూడబోతున్నారు అని నిర్ధారించింది. ఆ సంస్థ అధిపతి ఎన్నికల ముందే నాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి 30 సీట్లకు మించి రాకపోవచ్చని, బాబు గారు ఊహించనంత పరాజ యాన్ని చవిచూడబోతున్నాడు అని చెప్పారు. ఎన్నికల ఫలితాలు ఆయన అంచనాలకు దరిదాపులలో వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 స్థానాలు, తెలుగుదేశానికి 23 స్థానాలు, జనసేనకు ఒక స్థానం వచ్చాయి. జనసేన పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం వల్ల తెలుగుదేశానికి 23 స్థానాలు వచ్చాయి కానీ అదే జరగకుండా ఉంటే పది స్థానాలు మించి ఉండేవి కావు. ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఓడి పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రథమ కారణం గత ఐద...