Whose Capital Amaravathi - The Conclusion
15. ముగింపు/ఉపసంహారం ఈ పుస్తకంలో మనం ఇంతరవరకు ప్రాచీనకాలంలో ఆంధ్రుల రాజధానీనగరాలతో ప్రారంభించి ఆధునికకాలం వరకు, మరింత నిర్దిష్టంగా స్వాతంత్ర్యానంతరం కర్నూలు నుండి హైదరాబాదు ద్వారా 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించడానికి దారితీసిన ప్రక్రియ వరకు చరిత్రను పరిశీలించాం. 1953 లో రాజధానిని కర్నూలులో నిర్ణయించిన నాయకత్వశైలికీ, 2014 లో అమరావతి ఎంపికలో నాయకత్వశైలికీ తారతమ్యం చూశాం. రాజధానీనగర స్థలాల ఎంపికలో సైద్ధాంతిక నేపథ్యాన్ని చారిత్రిక దృక్కోణంలో పరిశీలించాం. వివిధ ఖండాలలో రాజధానీ నగరాల స్థాపనలో అంతర్జాతీయ అనుభవాలను, స్వాతంత్ర్యానంతరం మన దేశంలో రాజధానీ నగరాల ఏర్పాటు అనుభవాలను, 21వ శతాబ్దంలో ప్రజల డిమాండుపై రాష్ట్రాలను విభజించడం వల్ల కొత్తగా ఏర్పరచవలసి వచ్చిన రాజధానుల అనుభవాలను పరిశీలించాం. అమరావతికి నిర్దిష్టమైన, ప్రత్యేకమైన సమస్యల దృష్ట్యా లాండ్ పూలింగు, మల్టీ లేటరల్ ఏజెన్సీలనుండి ఆర్థిక సహాయం, కొన్ని విదేశాలు, కంపెనీలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి రాజధానీనగరం అమరావతి నిర్మాణానికి ఆహ్వానించిన ప్రభుత్వ ప్రయత్నాలు మొదలైనవాటి గురించి గత అధ్యాయాలలో చర్చిం...